Breaking News

ధరల నియంత్రణపై చర్యలేవీ?

02-09-2026 | 12:17am

రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకులు సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ఉంది. ప్రజల కొనుగోలు శక్తిని కూడా దృష్టిలో పెట్టుకుని మార్కెట్లో నిత్యవసర సరుకులు ధరలు తగ్గితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయ తక్కువ ధరలకు చౌక దుకాణం ద్వారా మార్గాలు చూపించాలి. ఇష్టానుసారంగా నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోతుంటే తాము బతికి బట్ట కట్టేది ఎలా అని ప్రజలు నిలదీస్తున్నారు.

మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను నియంత్రించాల్సిన అధికార వ్యవస్థ, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. రానున్న మరికొన్ని రోజుల్లో నిత్యవసర సరుకులు ధరలతో పాటు మరిన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని వస్తున్న వార్తల్లో సామాన్యులు పరిస్థితి మరింత దారు ణంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్రోల్ రూ.115 నుంచి 120కు సమీ పంలో ఉంది. గత కొద్ది రోజులగా అంతర్జాతీయగా జరుగుతున్న పరిణామా లు గమనిస్తే .. మళ్లీ వాటి ధరలు కూడా పెరిగే ఆస్కారం లేకపోలేదు. వంటగ్యాస్ ధర ఇటీవలే రూ.1070లు అయింది. 

ప్రతి రోజు నిత్యవసర సరుకులు లేనిదే సంసారం గడవదు. అలాంటి సరుకుల ధరలు అకాశాన్నింటితే మధ్యతరగతి ప్రజలు జీవనం సాగేది ఎలా ఆందోళన చెందుతున్నారు. అసలు ధరల నియంత్రణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేవీ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండే విధంగా ప్రభుత్వాలు తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ద్రవ్యోల్బణం ఏర్పడకుండా కట్టడి చేయాలని మెజార్టీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో చౌక దుకాణం ద్వారా గత ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి 9 రకాల నిత్యావసర సరకులు రేషన్ దుకాణాల ద్వారా అందిచేసినట్లుగానే  ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధికారులు క్షేత్ర స్థాయిలో మరోసారి వాటిపై సమగ్రంగా చర్యలు చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలి. అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా అందులోని లొటుపాట్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకుని పెరుగుతున్న ధరలకు కళ్లెం వేస్తే బాగుంటుంది.  

 సింగు. లక్ష్మీనారాయణ, చింతకుంట, కరీంనగర్


మరిన్ని వార్తలు