రాజు ఎవరో.. కింకరుడు ఎవరో?

09-09-2026 | 05:20am

చలాది పూర్ణచంద్ర రావు :

భారత సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court of India) 2017 నుండి ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరగా తేల్చెయ్యాలని పదేపదే ఆదేశాలు జారీ చేసినప్పటికి వాటికి ముగింపు పలకటంలో వ్యవస్థ తీవ్రంగా విఫలమవుతోందని, ఎక్కడ వేసిన గొంగళి అక్క డే అన్నవిధాన విచారణను(Inquiry) పూర్తి చెయ్యటంలో అసాధారణమైన ఆలస్యం, అభియో గాలను వేగంగా నమోదు చేయకపోవటమేకాక, సాక్షులను కూడా సక్రమంగా విచా రించడం లేదని, పైగా విచారణను పదే పదే వాయిదాలు వేస్తూ పోతుండటం వలన నేరన్యాయ విచారణ ప్రక్రియ(Criminal justice trial process) ప్రధాన ఉద్దే శ్యము దెబ్బతింటోందని సుప్రీంకోర్టులో అమికస్ క్యూరీ (న్యాయ సహాయకులు)(Legal Assistants) విజయహన్సారియ సర్వోన్నత న్యాయస్థానాని కి సమర్పించిన 22వ నివేదికలో పేర్కోవటం పరిశీలిస్తే న్యాయవ్యవస్థలో జరుగు తున్న మందగమనం ఆయన ఎత్తి చూపిన విధానం సంచలనం కలిగించిందని చెప్పక తప్పదు.

కొన్ని కేసుల్లో దశాబ్దంపైగా ఏమీ తేల్చకుండా వున్న కొన్ని కేసులపై ఇప్పటివరకు ప్రజల్లో న్యాయవ్యవస్థపైనే కాక ప్రభు త్వంపై కూడా వున్న అభిప్రాయాన్ని ఆ నివేదిక బలపర్చుతోందని చెప్పాలి. ఇంకా ఆ నివేదికలో కేసులు త్వరగా పూర్తి చెయ్యాలంటే సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టు లకు జారీ చేసిన ఆదేశాలు సరిపోవేమోనని తన నివేదికలో వ్యాఖ్యానించటం అంటే కే సుల పట్ల ఉదాసీనత వలనే అంత భారీ స్థాయిలో కేసులు వివిధ కోర్టుల్లో పేరుకు పోవటం కూడా ఆయన ఈ వ్యాఖ్యలకు ఒక కారణం కావచ్చని భావించాల్సి రాక తప్పనిసరి..

భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చెయ్యటానికి ముఖ్య కారణం చెప్పాలంటే, దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులను శాశ్వతంగా రాజకీయాల నుండి నిషేధించాలని 2016లో అశ్వనికుమార్ ఉపాధ్యాయ(Ashwini Kumar Upadhyay) అనే న్యాయవాది సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంలో భాగంగానే హైకోర్టులను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఈ పైఉత్తర్వులను జారీ చేసింది.

అయినప్పటికీ పెద్దగా మార్పేమీ లేనట్లుందని చెప్పేందుకు ఏళ్ళ తరబడి సాగుతున్న కొందరు ప్రజాప్రతినిధుల కేసుల పట్ల చూపుతున్న ఆలస్యం, ఎప్పుడు కావాలంటే అప్పుడు బెయిలు మంజూరు చెయ్యటం, తరచూ వాయిదాలు వేసి దశాబ్దాల తరబడి కేసులు సాగదీయటం పట్ల ఇప్పటికే ప్రజల్లో కొంత అసహనం, అనుమానం ఈ నివేదిక బలపర్చుతోందని చెప్పాలి.

సామాన్యులు కొందరికి ఏళ్ళతరబడి కేసులు వివిధ కారణాలతో ఉన్నప్పటికీ బెంచ్ మీదకు రాకుండా అండర్ ఖైదీలుగా మగ్గుతుంటే వారు సకాలంలో అనుభవించాల్సిన శిక్షకంటే కూడా ఎక్కువగా  జైళ్ల లో మగ్గుతున్నారని, అయితే పలుకుబడి, ఇతర సామాజిక హంగూబలం కలిగి వున్న కొందరి కేసులు తెల్లారేసరికి ఆయా కోర్టుల్లో బెంచ్ మీదకు రావటం టైలు, వాయిదాలు పొందటం లాంటి అంశాల తీరు ప్రజల మనస్సులో కోర్టుల ప్రతిష్ట ఇప్పటికీ కొంత మసక బారిందని చెప్పాలి.

ఆ నివేదికలో పేర్కొన్నట్లుగా ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో వున్న కేసులను, తీసుకో వలసిన చర్యలను వివరిస్తూ హన్సారియ సమర్పించిన నివేదికను పరిశీలిస్తే - ప్రస్తుతం దేసవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై మొత్తం 4,192 కేసులు అపరిష్కృతంగా వున్నాయి. వాటిలోప్రస్తుత లోక్‌సభలోని 513 మంది సభ్యుల్లో 251 మందిపై క్రిమినల్ కేసులు, 179 మందిపై తీవ్ర నేరారోపణల కేసులుండగా, 533మంది రాజ్యసభ సభ్యుల్లో 75 మందిపై క్రిమినల్ కేసులు, 40 మందిపై తీవ్ర నేరారోపణల కేసులు పెండింగ్‌లో వున్నాయని, అలాగే దేశంలోని 4111 శాసన సభ్యుల్లో 2008 మందిపై క్రిమినల్ కేసులు, 1296 మందిపై తీవ్ర నేరారోపణల కేసులు కొనసాగుతున్నాయి.

అంటే మొత్తం 3,304 ఎమ్మెల్యేలు వివిధ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అలాగే 14 రాష్ట్రాల ముఖ్య మంత్రుల మీద పెండింగ్  కేసులు పరిశీలిస్తే అత్యధికంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై 89 కేసులు పెండింగ్‌లో వుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై 19 కేసులు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేంద్ అధికారిపై 29 కేసులు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై 19 కేసులు  అప రిష్కృతంగా వున్నాయని ఆ నివేదిక పేర్కోవటం పరిశీలిస్తే సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ వివిధ కోర్టులు చేస్తున్న అలసత్వాన్ని తెలియచేస్తోంది.

పైగా ఆంధ్రప్ర దేశ్‌లో  25 మంది పార్లమెంట్ సభ్యుల్లో 13 మందిపై క్రిమినల్, మరో 9 మందిపై తీవ్రమైన కేసులుండగా మిగిలిన ముగ్గురిపై  కేసులేమీ లేవు. ఇలా అన్ని రాష్ట్రాల్లో వున్న కేసుల్లో నిందితులు పదవుల్లో వున్నప్పుడు అసాధారణ ఆలస్యం జరుగుతుండటం, ఈ జాప్యం నిందుతులకు అనుకూలంగా మారి కేసులు బలహీనపడటం.. కేసులు నీరుకారిపోవటం జరుగుతున్నాయని అందరికి తెలి సిన విషయమే. గడచిన 2025 ఆఖరు నాటికి భారత న్యాయవ్యవస్థలో మొత్తం 5కోట్ల 9లక్షల 34వేల 126 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో వున్నట్లు సమాచారం.

వీటిలో సివిల్ కేసులు కోటి పన్నెండు లక్షల అరవై రెండు కాగా, మిగిలిన మూడు కోట్ల తొంభై ఆరు లక్షల డ్బ్బు వేల అరవై నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో వున్నాయని (కొన్ని కేసులు పెరుగుతూ తగ్గుతూ ఉండొచ్చు) నేషనల్ జుడీషియల్ డేటా గ్రిడ్ సమాచారం ప్రకారం తెలుస్తోంది. మొత్తం కేసుల్లో 38 శాతం సంవత్సరానికిపైగా పెండింగ్‌లో వుం డగా, ఒకటి నుండి మూడు సంవత్సరాలకు పైగా 23 శాతం, మూడు నుండి ఐదు సంవత్సరాలుగా 13శాతం, ఐదు నుండి 10 సంవ త్సరాలలోపు 17 శాతం కేసులు పెండింగ్ లో వుండగా, పది సంవత్సరాలకు పైబడి పెండింగ్‌లో ఉన్న కేసులు 9 శాతంగా వున్నట్లు ఆ డేటాగ్రిడ్ తెలియ చేయటం ఆందోళన కలిగించే విషయం.

ఈ మొత్తం కేసుల్లో అత్యధికంగా జిల్లాల కోర్టుల్లోనే  పెండింగ్‌లో వున్నట్లు తెలిపింది. వీటిలో భూమి మరియు ఆస్తి వివాదాలకు సంబంధించిన కేసులు అత్యధికంగా వున్నాయని ఆ నివేదిక తెలిపింది. ఈ పెండింగ్‌లో వున్న మొత్తం కేసుల సంఖ్య భారత న్యాయవ్యవస్థకు ఒక ముఖ్య సవాలుగా మారిందని చెప్పాలి. ఈ మొత్తం కేసులు పరిష్కారం అవ్వాలంటే 324 సంవత్సరాలు పడుతుందని అంచనా !

కాగా భారత న్యాయస్థానాలలో ఇన్ని కేసులు పేరుకు పోవటానికి కారణం కేవలం సుప్రీం కోర్టు ఆదేశాలను దిగువ స్థాయి కోర్టులు పెడచెవిన పెడుతున్నాయని అమికస్ క్యురి తన 22వ నివేదికలో పేర్కొన్నప్పటికీ వాస్తవంగా జాతీయ స్థాయిలో ఖాళీగా వున్న న్యాయమూర్తుల పదవుల భర్తీ, ప్రక్రియ పరమైన జాప్యాలు, చాలినంత మౌలిక సదుపాయాలు లేకపోవటం, తరచూ బదిలీలు, మరియు పలు వురు సెలవులపై వెళ్ళటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంకా సరిపడినంత అందిపుచ్చు కోలేకపోవటం లాంటి పలు సమస్యలు కూడా ఈ పెండింగ్ కేసుల సంఖ్య పెరగటానికి, తద్వారా సకాలంలో న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి.

పైగా మనదేశంలో ప్రతి పదిలక్షల మంది జనాభాకు కేవలం 21మంది మాత్రమే న్యాయమూర్తులు వున్నారు. ఈ సంఖ్య ప్రజాస్వామ్య దేశాల్లో అత్యధిక అల్పం కూడా. ఈ నిష్పత్తి సంఖ్య పెంచాలని ‘లా కమిషన్‘ పదేపదే చేసిన సిఫార్సులు అమలు కాకపోవడం కూడా ఈ కేసుల సంఖ్య పెరగటానికి ఒక కారణం. పైగా ప్రభుత్వ శాఖలే అతిపెద్ద వ్యాజ్యకారులుగా వుంటాయి. విజయావకాశాలు తక్కువగా వున్న కేసులు కూడా విధానపరంగా అనేక కేసులు అప్పీల్‌కు దాఖలు చేయబడటం  ఒక కారణం.

ఇలా కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్లు ఇన్ని కోట్ల కేసులు భారత న్యాయస్థానాల్లో పేరుకుపోవటానికి అనేక కారణాలు, చట్టంలో లొసుగులు.. ఒక నేరస్తుడు పలుకేసుల్లో కోర్టులకు వెళ్ళకుండా వున్న అవకాశాలను అడ్డదిడ్డంగా వాడుకుంటూ ఏళ్ళ తరబడి కోర్టు మొహం  చూడకుంటే, భవిష్యత్‌లో ఫలానా కేసులో ఫలానా వారు ఈ ప్రకారం కేసుల నుండి పొందిన మినహాయింపు వుదహరించి తమ కక్షిదారులకు కూడా అదే మినహాయింపు ఇవ్వాలని ఉదహరిస్తే దానికి సమాధానం ఏమని చెప్పాలి. ఇలాంటి లొసుగులు సవరించి భారత న్యాయశాస్త్ర చట్టాలను కూడా మార్పు చెయ్యవలసిన అవసరం ఎంతో వుంది అని న్యాయనిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్

9491545699

మరిన్ని వార్తలు