అధ్యక్ష పీఠం ఎవరికో?
- కాంగ్రెస్ వర్గీయుల్లో ఉత్కంఠ
- షీల్ కవర్ తయారు చేసిన ఢిల్లీ ప్రతినిధి
- ఆ కవర్లో ఆరుగురు ఎవరు?
- జిల్లాకు కొత్త అధ్యక్షుడా... పాత అధ్యక్షుడే కొనసాగేనా..?
- కొత్త వారిలో పార్టీని నడిపే సత్తా ఉందా
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 17(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ఆ పార్టీ వర్గీయుల్లో ఉత్కంఠ నెలకొంది.పార్టీ అధిష్టానం జిల్లా ఇన్చార్జిగా ఏఐసీసీ ప్రతినిధి నరేష్ కుమార్ తో పాటు పిసిసి కోఆర్డినేటర్లు శ్రీనివాస్ గౌడ్, అనిల్ కుమార్, జ్యోతి ఈనెల 11 నుండి జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో కార్యకర్తల అభిప్రాయాలతో పాటు నాయకుల సూచనలు వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించారు.
ఎంపిక ప్రక్రియలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారి నుండి ఒక్కొక్కరిగా పిలుస్తూ వారి యొక్క వివరాల సేకరించడంతోపాటు పార్టీకి చేసిన సేవలను అడిగి తెలుసుకున్నారు.జిల్లా అధ్యక్ష పదవికి 38 మంది దరఖాస్తు చేసుకోగా 28 మంది వ్యక్తిగతంగా కలిసి వారు పార్టీకి చేసిన సేవలు ఏఐసీసీ ప్రతినిధికి వివరించారు.వ్యక్తిగతంగా హాజరైన 28 మందిలో ఆరుగురిని ఎంపిక చేసి అధిష్టానానికి నివేదించనన్నారు.15 రోజుల్లో అధ్యక్షుడి ప్రకటించడం జరుగుతుందని ఢిల్లీ ప్రతినిధి ప్రకటించడంతో జిల్లాలోని నాయకుల్లో నూతన ఉత్సాహం నింపింది.
జిల్లాను నడిపించే నాయకుడు ఉన్నాడా?
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష ఎంపిక ప్రక్రి య సీరియస్‌గా ప్రణాళిక బద్ధంగా చేపట్టింది. జిల్లా లో 32 మంది దరఖాస్తు చేసుకోగా 28 మంది వ్యక్తిగత వివరాలను ఢిల్లీ ప్రతినిధికి అందజేశారు. ప్రతినిధి దరఖాస్తుదారులను పలు ప్రశ్నలు వేస్తూ వివరాలు సేకరించారు.జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలమైన రాజకీయ పార్టీ కాక తెలంగాణ రాష్ట్రం లో అధికారంలో ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవి పై పలువురు ఆశలు పెట్టుకున్నారు.
బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉం టూ వారిలో మనోధైర్యాన్ని నింపు తూ భరోసాగా నిలిచాడు. ప్రస్తుతం పార్టీ పాత అధ్యక్షులకు మళ్లీ జిల్లా బాధ్యతలు అప్పగించే ఆలోచన లేకపోవడంతో పాటు ఐదు సంవత్సరాలకు పైబడి పార్టీలో సేవలందించిన వారికి పాధాన్య త ఉంటుందని ప్రక టించింది.
జిల్లా లో దరఖాస్తు చేసుకున్న వారి లో జిల్లా అధ్యక్ష బాధ్యత వస్తే పార్టీని నడిపించే శక్తి ఉంటుం దా అనే ప్రశ్న ఉత్ప న్నం అవుతుంది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి అంటే అందరిని సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాల్సి ఉంటుం ది. అధ్యక్ష పదవి అంటే పార్టీకి సేవలు అందించడమే కాక తన జీవితాన్ని సైతం దారపోయడమే అన్న విషయం అందరికీ తెలిసిందే.
అధిష్టానానికి ఆరుగురి తో కూడిన నివేదికను ఢిల్లీ ప్రతినిధి నరేష్ కుమార్ అందించినప్పటికీ ఇక్కడ మాత్రం నూతన అధ్యక్షుడు వస్తే పార్టీకి లాభం చేకూరుతుందా అనే ప్రశ్నలు చాలా సందర్భాల లో ఉత్పన్నమవుతున్నాయి.అధిష్టానం నియమ నిబంధనలు పెట్టినప్పటికీ కొన్ని జిల్లాలలో పరిస్థితులను బట్టి పాతవారినే కొనసాగించాలని ఆలోచన సైతం పార్టీ ఉన్నత వర్గాల్లో లేకపోలేదు.పాతవారు జిల్లా పై పట్టు ఉండడమే కాకుండా ప్రతిపక్షంలో ను కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కార్యకర్తలకు అండగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి.
సీల్ కవర్‌లో ఎవరి పేర్లున్నాయి?
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం 32 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు.28 మంది వ్యక్తిగ తంగా ప్రతినిధికి కలిసి వారు పార్టీ చేసిన సేవలను వివరించారు.28 మం దిలో ఆరుగురిని ఎంపిక చేసే పనిలో ఏఐసీసీ ప్రతినిధి నరేష్ కుమార్ తో పాటు పిసిసి కోఆర్డినేటర్లు శ్రీనివాస్ గౌడ్, అనిల్ కుమార్ ,జ్యోతి ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న పేర్లతోపాటు ఎంపిక చేసే ఆరుగురు పేర్లు సైతం గోప్యంగా ఉంచడంతో పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
షీల్ కవర్లో తమ పేర్లు అధిష్టానానికి వెళ్ళుతాయని ఎవరి ధీమాలో వారు ఉన్నారు. అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా తిర్యాని కి చెందిన అనిల్ గౌడ్,ఆసిఫాబాద్‌కు చెందిన బాలేశ్వర్ గౌడ్, మసాదే చరణ్, వసంత్ కుమార్ రెబ్బెనకు చెందిన దుర్గం సోమయ్య, చెన్న సోమశేఖర్,జై నూర్ ఏఎంసీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ డిసిసి పీఠంపై ఆసక్తి చెప్తున్నారు.




