17-10-2025 10:57:39 PM
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని పార్టీ కార్యాలయం లో ఏర్పాటు విలేకరుల సమావేశం లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. రాజ్యాంగ బద్దంగా చట్ట సవరణ చేసి 42 శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. జీవో ప్రకారం రెసర్వేషన్ సాధ్యం కాదని పార్టీ తరుపున చెప్పిన ప్రభుత్వం వినలేదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లే జరిగిందన్నారు. స్థానిక సంస్థలో అయినా రిజర్వేషన్ ఉంటే రాజకీయం గా సమానత వస్తుందన, రాజ్యాంగ పరంగా.. రాజకీయంగా ఉన్నామనే భావన ప్రజల్లో ఉంటదన్నారు. విద్య,ఉపాధి రంగాల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని, బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలన్నారు. ఆర్టీసీ బస్సులను అధికారులు బయటికి తీయవద్దని,విద్య వ్యాపర సంస్థలు బంద్ లో పాల్గొనాలన్నారు. 42 శాతం రిజర్వేషన్ సాధించే విధంగా పోరాటం సాగాలని, ప్రతి ఒక్కరు సహకారం ఇవ్వాలన్నారు.