calender_icon.png 18 October, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాసిరకం పనులతోనే నీటి సరఫరాలో అంతరాయం

17-10-2025 11:02:16 PM

పనులు పల్చగా చేసి పబ్లిసిటీ గట్టిగా చేసిండ్రు

కాలేశ్వరం ప్రాజెక్టు లాగే మిషన్ భగీరథ పైప్ లైన్లు

విలేకరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): నాసిరకం పనులు చేసి ప్రచారం మాత్రం గట్టిగా చేసుకుని గత ప్రభుత్వం కాలం వెళ్ళదీసిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్టు దేశానికే తలమానికమంటూ నిర్మాణం చేసి అంగుహార్భాటాలు తో పెద్దపెద్ద బోర్డులు పెట్టి ప్రచారం చేసుకుని తీరా ఇప్పుడు చూస్తే పగుళ్లు వచ్చాయని అసహనం వ్యక్తం చేశారు.

మిషన్ భగీరథ పైప్ లైన్ లో కూడా పనులు నాణ్యతగా లేవని అందులో భాగంగానే జడ్చర్ల లోని నాగసాల దగ్గర, మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలోని ధర్మపురి దగ్గర పైపులైన్లు పగిలిపోతున్నాయని తెలిపారు. చేసిన పనులు నాణ్యతగా ఉంటే భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రచారం గట్టిగా చేసుకుని పనులు మాత్రం పల్చగా చేస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కునే వలసిన పరిస్థితి వచ్చిందని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. శాశ్వత పనులు తాగునీటిలో ఇబ్బందులు రాకూడదని ఉద్దేశంతోనే నియోజకవర్గంలో రూ 220 కోట్లు ఖర్చు చేసి పక్క ప్రణాళికలతో ప్రతి నెల రివ్యూ నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

మంచినీటి ఎద్దడి పూర్తిస్థాయిలో నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. చేస్తున్న పనులను మాత్రమే ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నామని ఎక్కడ కూడా గందరగోళ పరిస్థితులు లేకుండా వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచి అభివృద్ధి కార్యక్రమాలను సాధ్యమైనంత వేగవంతంగా నాణ్యతగా చేసుకుంటూ అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ ఇంచార్జి బెనహర్ తదితరులు ఉన్నారు.