ఫైనల్ పంచ్ ఎవరిది ?
12-07-2026 12:53 AM
హైదరాబాద్, జూలై 11 : యువ క్రికెటర్ల ను ప్రోత్సహించే ఉద్దేశంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న తెలంగాణ టీ20 లీగ్ చివరి అంకానికి చేరింది. ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్లో హైదరాబాద్ ఈ ఛాంపియ న్స్, ఖమ్మం ఏసెస్ తలపడబోతున్నాయి.
క్వాలిఫైయర్ 1లో ఈ రెండు జట్లు తలపడ గా ఖమ్మం విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన హైదరాబాద్ క్వాలిఫైయర్ 1లో ఓడినా తర్వాత క్వాలిఫైయర్ 2లో కరీంనగర్‌పై గెలిచి ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఇదిలా ఉంటే విజేతగా నిలిచిన జట్టుకు కోటి రూపాయల ప్రైజమ్‌నీ దక్కనుంది.






