12 July, 2026 | 2:23 AM

క్రాంతి గౌడ్ పాంచ్ పటాకా

12-07-2026 12:55 AM
  1. చరిత్ర సృష్టించిన భారత పేసర్
  2. ఇంగ్లాండ్ 170 ఆలౌట్
  3. భారత్‌కు భారీ ఆధిక్యం

లార్డ్స్, జూలై 11 : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జ ట్టు పట్టుబిగించింది. రెండోరోజే ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేసి భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో భారత మహిళల జట్టు యువ పేసర్ క్రాంతి గౌడ్ చారిత్రక లార్డ్స్ మైదానంలో చరిత్ర సృష్టించింది.

క్రికెట్ మక్కాలో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి మహిళా బౌలర్‌గా రికార్డు సాధించింది. ఫలితంగా భారత్ ఇంగ్లండ్‌ను 170 పరుగులకే ఆలౌట్ చేసిం ది. ఈ ప్రదర్శనతో టెస్టు క్రికెట్‌లో ఐదు వికెట్లు సాధించిన అత్యంత పిన్న వయస్కురాలైన భారత మ హిళా ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండోరోజు ఆటముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. స్మృతి మంధాన 69, యాస్తిక భాటియా 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.