26 August, 2026 | 3:42 PM

జడ్చర్లలో భారీ శాంతి ర్యాలీ

26-08-2026 02:24 PM

జడ్చర్ల, ఆగస్టు26, (విజయక్రాంతి): : మహమ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని జడ్చర్ల పట్టణంలో ముస్లిం సోదరులు నిర్వహించిన భారీ శాంతి ర్యాలీలో మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహమ్మద్‌ ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సమభావం, సోదరభావం ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రవక్త చూపిన సన్మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సామరస్యాలను పెంపొందించాలని ఆకాంక్షించారు. మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ డా. సి. లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.