ఇరాన్‌కు ఎవరు సాయం చేసినా మాకు శత్రువే
అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ హెచ్చరికలు
వాషింగ్టన్, ఏప్రిల్ ౨౮: ఇరాన్‌కు ఎవరు సాయం చేసినా తమ దేశానికి శత్రువేనని, వారి అంతు చూసే వరకు వదిలిపెట్టబోమని తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ విమానయాన సంస్థలతో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో సం బంధాలు కలిగి ఉన్న ఏ సంస్థకైనా జరిమా నా విధించి తీరుతామని తేల్చిచెప్పారు. ఇరా న్ జెట్ ఇంధన అవసరాలు తీర్చడం దగ్గర్నుంచి, విమానాల మరమ్మతుల వరకూ ఏ దేశ ప్రమేయమూ ఉండకూడదని స్పష్టం చేశారు.
అఖరికి ఇ రాన్ విమానాల్లో భోజన సదుపాయం క ల్పించినా తమ శత్రువుల జాబితాలో చేరవల్సిందేనని తెలిపారు. గ్రౌండ్ హ్యాండ్లింగ్, విమానాశ్రయ రుసుముల చెల్లింపులపై అమెరికా నిఘా ఉంటుందని వెల్ల డించారు. బెస్సెంట్ వ్యాఖ్యల వల్ల ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలు లేదా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా మా ర్కెట్ తమను బహిష్కరిస్తుందని బిక్కుబిక్కుమంటున్నాయి. అమెరికా తాజా హెచ్చ రికలతో ఇరాన్ విమాన సర్వీసులకు విదేశీ విమానాశ్రయాల్లో ఇంధనం లేదా ఇతర సేవలు లభించడం కష్టతరంగా మారే అవకాశం ఉంది.






