29 April, 2026 | 2:14 AM

నువ్వు సింగం అయితే నేను పుష్ప

29-04-2026 12:22 AM
  1. ఐపీఎస్ అధికారికి టీఎంసీ లీడర్ వార్నింగ్
  2. తుది విడత ఎన్నికల వేళ దుమారం

కోల్‌కతా, ఏప్రిల్ ౨౮: ‘నువు సింగం అయితే నేను పుష్ప’ అంటూ పశ్చిమబెంగాల్‌కు చెందిన అధికార టీఎంసీ నేత జహం గీర్‌ఖాన్ మంగళవారం ఐపీఎస్ అధికారి అజయ్‌పాల్ శర్మకు వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. బుధవారం తుది విడతల ఎన్నికలు జరుగనున్న వేళ ఈ పరిణామం ఎన్ని కల సంఘానికి, యంత్రాంగానికి పెద్ద తలనొప్పిగా మారింది. టీఎంసీ మద్దతుదా రులు కొద్దిరోజులుగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తాకు చెందిన ఓటర్ల నుంచి బలవంతంగా ఐడీ కార్డులను తీసుకుంటున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అం దింది. విచారణ అధికారిగా ఐపీఎస్ అధికారి అజయ్‌పాల్ శర్మ సోమవారం రాత్రి ఫల్తాకు వెళ్లారు.

ఓటర్ కార్డుల అపహరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత జహంగీర్ ఖాన్‌ను విచారించేందుకు య త్నించారు. ఓటర్లను భయపెట్టేందుకే అజయ్‌పాల్ శర్మ ఫల్తాకు వచ్చారని జహంగీ ర్‌ఖాన్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన సదరు ఐపీఎస్‌కు ‘సింగం’ అనే పేరుంది. ఈ క్రమంలోనే అజయ్‌పాల్ శర్మ సింగమైతే తాను పుష్ప అంటూ జహంగీర్‌ఖాన్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి ఈ వివాదంపై ఎన్నికల సంఘం స్పందించింది. స్థానిక జాయింట్ బీడీఓ సౌరవ్ హజ్రాను బదిలీ చేయించింది. అలాగే, ఐపీఎస్ అజయ్‌పాల్ శర్మ వైఖరిపైనా విచారణకు ఆదే శించింది.