calender_icon.png 22 February, 2026 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరంతా ఊరు బయటకే..

21-02-2026 08:49:35 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): ఊరంతా ఒకరోజు ఊరు బయట గడుపుతారట.. ఇదేంటి అనుకుంటున్నారా అది నిజమే.. ఆ ఊరికి ఏదో కీడు శంకిస్తుందని ఆ గ్రామస్తుల నమ్మకం. పూజారులకు చూపిస్తే ఒకరోజు ఉదయం వేకువజామున ఊరంతా పిల్లాపాపలతో బయటకు వెళ్లి గడిపి సాయంత్రం సూర్యోదయం ముగిశాక ఇంటికి రావాలని తెలిపారు. దీనితో గ్రామస్తులు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఈ పరిణామం చేసేందుకు నిర్ణయించారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం. దీనిని ఈ ఆదివారం పాటించేందుకు సిద్ధమయ్యారు.