15 April, 2026 | 6:36 AM

ఒంటరితనం భరించలేక యువకుడు ఆత్మహత్య

21-02-2026 08:51 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): మొండికుంట గ్రామానికి చెందిన సున్నం జయంత్ (22) శనివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, జయంత్ తండ్రి బాలరాజు గతంలో ప్రమాదంలో మరణించగా, తల్లి కూడా అతన్ని వదిలి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం. ఒంటరితనాన్ని భరించలేక మొండికుంట గ్రామ శివారులోని ఓ చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి బాబాయి సున్నం సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.