4 July, 2026 | 3:27 AM

నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు

04-07-2026 02:21 AM

మహబూబాబాద్, జూలై 3 (విజయక్రాంతి): వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో శనిగపురం తండా, బోడ గుట్ట తండా, నడివాడ, గడ్డి గూడెం తండా, అనంతారం గ్రామాలలో ఎక్సైజ్, డిటీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ టీంలు సంయుక్తంగా నాటుసారా తయారీ కేంద్రాలపై దాడుల నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, 17 లీటర్ల నాటుసారా 10కిలోల పటిక స్వాధీనం చేసుకొని,1,200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. తర్వాత ముగ్గురు వ్యక్తులను తాహసిల్దార్  ముందు బైండోవర్ చేసినట్లు సీఐ పేర్కొన్నారు.