వన్యప్రాణుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
03-03-2026 10:51 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): వన్యప్రాణుల పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ(Wildlife conservation) శాఖ అధికారులు పిలుపునిచ్చారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో వన్యప్రాణి పరిరక్షణ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ సురేష్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు శ్రీనివాసన్, మాధవి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




