29 June, 2026 | 1:13 AM

స్నేహిత హిల్స్‌లో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేనా..?

29-06-2026 12:00 AM
  1. మొక్కుబడిగా పనులు చేస్తున్న రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు
  2. మురుగు నీటితో కంపును భరించలేకపోతున్న కాలనీవాసులు

రాజేంద్రనగర్, జూన్ 28 (విజయక్రాంతి): జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని స్నేహిత హిల్స్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. పలు సమస్యలతో సతమతమవుతున్న కాలనీవాసులకు ప్రధానంగా డ్రైనేజీ సమస్య తలనొప్పిగా మారింది..

వాల్యూ ఓక్ జూనియర్ కాలేజీ ముందు ప్రధాన రోడ్డు పై ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లో చెత్త పేరుకు పోవడం తో డ్రైనేజీలోని మురుగు నీరు బారీగా రోడ్డు పైకి వచ్చి  దుర్వాసన వెదజల్లుతుంది రోడ్డుపై నిలిచిన నీటితో ప్రయాణానికి ఎంతో ఇబ్బందిగా మారింది ఫిబిల్ సిటీ ప్రధాన రోడ్డు వెంబడి మురుగు నీరు ప్రవహిస్తుంది గతంలో పలుమార్లు రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు ఈ డ్రైనేజీ సమస్యకు శాశ్వత మరమ్మతులు చేయకపోవడంతో  మరో వారం రోజుల తర్వాత డ్రైనేజీ సమస్య యధావిధిగా తయారవుతుంది 

డ్రైనేజీ  సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి ః ప్రమోద్ రెడ్డి

జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు స్పందించి స్నేహిత హిల్స్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి రోడ్డుపై పారుతున్న మురుగు నీటితో దుర్వాసనను భరించలేకపోతున్నామని స్నేహిత హిల్స్ కాలనీ వాసి ప్రమోద్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు ..