యూరియా దొరకక జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు
26-08-2026 11:24 AM
తూప్రాన్, ఆగస్ట్ 26(విజయక్రాంతి): వ్యవసాయ రైతులకు యూరియా దొరకక తూప్రాన్ జాతీయ రహదారిని నిర్బంధించారు. గత వారం రోజులుగా రెడ్డి ఫర్టిలైజర్ షాపులలో పంటలకు సకాలంలో యూరియా దొరకక రైతులు తూప్రాన్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగి నిరసన తెలిపారు. జాతీయ రహదారి పూర్తిగా ట్రాఫిక్ జాం తో నిర్బంధించ బడింది. రైతులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో రైతులకు యూరియా సక్రమంగా దొరికిందని కేంద్రంలో బిజెపి అధికారం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి రైతులకు ఎక్కడ యూరియా దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఇదే పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని వారి బాధ వ్యక్తం చేశారు.






