26 August, 2026 | 1:02 PM

బూర్గంపాడులో ఘనంగా వన మహోత్సవం

26-08-2026 11:55 AM

బూర్గంపాడు,(విజయక్రాంతి): పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో బూర్గంపాడు మండలంలో మంగళవారం వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలు, పాఠశాలల ప్రాంగణాల్లో విస్తృతంగా మొక్కలు నాటారు.మొరంపల్లి బంజర గ్రామపంచాయతీ పరిధిలోని డంపింగ్‌ యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి మహావృక్షంగా ఎదిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. పచ్చదనం పెంపొందించడం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో సర్పంచ్‌ బొర్రా సుభద్ర, ఉప సర్పంచ్‌ పొక్కుల రవి,ఏపీఓ విజయలక్ష్మి,టిఏ స్వాతి, పంచాయతీ కార్యదర్శి భవాని,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.