26 August, 2026 | 12:53 PM

స్వీపర్ మృతి.. కుటుంబానికి ఆర్థిక సాయం

26-08-2026 11:50 AM

మల్లాపూర్, ఆగస్టు 26(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీలో గత కొన్ని సంవత్సరాలుగా స్వీపర్‌గా సేవలందించిన అల్లాడి (బుక) దయాకర్ మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆయన సేవలను గుర్తించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, పాలకవర్గ సభ్యులు దయాకర్ కుటుంబానికి తక్షణ సహాయంగా పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

గ్రామ పంచాయతీలో దయాకర్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ముష్కరి రమేష్, అరికుప్పల చిన్న రాజం, ఏనుగంటి నరేష్, కాషవత్తుల గంగా రెడ్డి, ముత్యాల గంగా రాజం, అల్లె లత-చంద్రయ్య, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు