జోరు కొనసాగేనా?
- లక్నోతో సన్‌రైజర్స్ పోరు
- ఉప్పల్‌లో పరుగుల వరదే
- తీవ్ర ఒత్తిడిలో లక్నో జట్టు
హైదరాబాద్, ఏప్రిల్ 4 : ఐపీఎల్ 2026 సీజన్‌లో రెండో డబుల్ హెడర్ ఆదివారం అభిమానులను అలరించబోతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజ ర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడబోతోంది. సొంతగడ్డపై సన్ రైజర్స్‌కు ఈ సీజన్‌లో ఇదే తొలి మ్యాచ్. ఆరం భ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడినప్పటకీ.. తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ కోల్‌కతా నైట్ రైడర్స్ కు షాకిచ్చింది.
భారీ స్కోరుతో పాటు బౌలింగ్ పరంగానూ మెరుగ్గా రాణించి తొలి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే జోరును సొంతగడ్డపై నా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. క మిన్స్ వెళ్లిపోవడంతో ఇషాన్ కిషన్ సారథిగా కొనసాగనున్నాడు. సన్ రైజర్స్ బ్యా టింగ్‌లో ఓపెనర్లు కీలక ఆటగాళ్లంతా ఫామ్‌లోకి వచ్చారు. హెడ్, అభిషేక్ శర్మ. క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి గత మ్యాచ్‌లో అదరగొట్టారు. ఇషాన్ కిషన్ కూడా చెలరేగితే తిరు గుండదు.
పైగా ఆడబోతోంది హోంగ్రౌండ్ లో కావడంతో ఇక్కడి కండీషన్లు బాగా తెలు సు. గత సీజన్‌లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ బ్యాటర్లందరూ పరుగుల వరద పా రించారు. దీంతో మరోసారి వారి విధ్వంసం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బౌలింగ్ పరంగా మాత్రం కాస్త ఆందోళన ఉన్నప్పటకీ గత మ్యాచ్‌తో అది కూడా తీరిపోయింది. బలహీనమైన బౌలిం గ్ అంటూ వచ్చిన అభిప్రాయాన్ని సన్ రైజ ర్స్ బౌలర్లు మార్చినట్టే కనిపిస్తున్నారు. గత మ్యాచ్‌లో ఉనాద్కట్, ఎహసాన్ మలింగతో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్‌లో ఆకట్టుకున్నారు.
ఈడెన్ లాంటి బ్యా టింగ్ పిచ్ పై కోల్ కతాను ఆలౌట్ చేసి తమ బౌలింగ్ మీద ఉన్న సందేహాలకు చెక్ పెట్టా రు. ప్రస్తుతం ఏ విధంగా చూసిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి ఒత్తిడిలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై పేలవ ప్రదర్శనతో లక్నో నిరాశ పరిచింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు లక్నో కొంపముంచాయి. పంత్ ఓపెనర్ గా ఫెయిలయ్యాడు.
కెప్టెన్‌గానూ పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాటింగ్‌లో అంచనాలు పెట్టుకు న్న ఏ ఒక్కరూ రాణించలేదు. అటు బౌలింగ్‌లో మాత్రం కాస్త మెరుగైన ప్రదర్శనే చేయ డం కాస్త రిలీఫ్‌గా చెప్పాలి. అయితే బ్యాటర్లు గాడిన పడితే తప్ప లక్నో గెలుపు బాట పట్టే పరిస్థితి లేదు. మాక్రరమ్, మిఛెల్ మార్ష్ , పంత్, పూరన్ తమ బ్యాట్‌కు పనిచెప్పాల్సిం దే. గత మ్యాచ్‌లో అబ్దుల్ సమద్, మార్ష్ మాత్రమే పర్వాలేదనిపించారు. బౌలింగ్ పరంగా మాత్రం ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్, షమీ రాణించారు.
గత రికార్డులు
ఐపీఎల్ చరిత్రలో లక్నో, సన్‌రైజర్స్ 6 సార్లు తలపడ్డాయి. లక్నో 4 మ్యాచ్‌లలో గెలవగా, సన్ రైజర్స్ కేవలం 2 మ్యాచ్‌లలోనే విజయం సాధించింది. గత సీజన్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి.
పిచ్ రిపోర్ట్
ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటుంది. ఇక్కడి ఫ్లాట్ వికెట్‌పై బ్యాటర్లు పండగ చేసుకోవచ్చు. ప్రతీసారీ భారీస్కోర్లు నమోదయ్యే ఈ పిచ్‌పై ఛేజింగ్ చేసే జట్టుకు విజయావకాశాలుంటాయి.
తుది జట్లు అంచనా
సన్‌రైజర్స్ హైదరాబాద్ : హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్), క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష దూబే , శివాంగ్ కుమార్, ఉనాద్కట్, డేవిడ్ పైన్
లక్నో సూపర్‌జెయిట్స్ : మిఛెల్ మార్ష్, పంత్(కెప్టెన్), మాక్రరమ్, బదోనీ, పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మోహిసిన్ ఖాన్, నోర్జే, షమీ, ప్రిన్స్ యాదవ్




