అవినీతి మరకలు తొలగేనా? అమాత్యుడిగా మెప్పించేనా?
-మంత్రిగా అజారుద్దీన్ కార్యశీలతపై ప్రజల్లో అనుమానాలు
-పాతికేళ్ల క్రితం క్రికెట్‌లో ఆయనపై మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు
-సీబీఐ దర్యాప్తు.. అజర్ బీసీసీఐ నిషేధం.. కెరీర్ ముగింపు
-హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగినప్పుడు నిధుల గోల్‌మాల్ కేసులు
-మళ్లీ తెరమీదకు పాత కేసులు.. వివిధ స్థాయుల్లో పెండింగ్
-మంత్రి పదవి నిర్వహణపై అనేక ప్రశ్నలు
హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): క్రికెటర్‌గా మహమ్మద్ అజహరుద్దీన్ ఒక వెలుగు వెలిగారు. భారత జట్టుకు సారథ్యం వహించారు. తన పేరుపై అనేక రికార్డులు సైతం నెలకొల్పారు. కెరీర్ ఉన్నతంగా సాగుతున్న సమయంలో ఆయనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. సీబీఐ విచారణ నేపథ్యంలో బోర్డ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఏకంగా ఆయనపై నిషేధం విధించింది.
తనపై నిషేధాన్ని సవాల్ చేస్తూ అజారుద్దీన్ హైదరాబాద్ సిటీ సివిల్‌కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం సీబీఐ ఉం టంకించిన అంశాలను పరిశీలించి నిషేధాన్ని సమర్థించింది. తర్వాత హైకోర్టు ఆ నిషేధాన్ని తప్పుబట్టి ఎత్తివేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. బుకీలతో అజారుద్దీన్ స్నేహంగా మెలగడం, వారి కనుసన్నల్లో, వా రు కోరినట్టుగా వ్యవహరించినట్టు సీబీఐ తన విచారణ తేల్చడంతో క్రికెటర్ ప్రస్థానం ముగిసిం ది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో అజారుద్దీన్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అనేక పోలీస్‌స్టేసషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నీ ప్రస్తుతం విచారణ దశలో నే ఉన్నాయి. తాజాగా తెలంగాణ క్యాబినెట్ మం త్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో గతం లో ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు అంశా లు మరోసారి తెరమీదకు వచ్చాయి.
కాంగ్రెస్ అధిష్ఠానం అజారుద్దీన్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని చూసినప్పుడు.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టవద్దని సెప్టెంబర్ మొదటి వారంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి బీజేపీ నేత దారం గురవారెడ్డి వినతిపత్రం సమర్పించారు. అజారుద్దీన్‌పై ఎన్నో క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయని, ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సైతం విచారణను ఎదుర్కొంటున్నారని గురవారెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈక్రమంలో అజారుద్దీన్‌కు ఎమ్మె ల్సీ పదవికి క్లియరెన్స్ రాలేదు.
నిష్కళంకుడిగా కేసుల నుంచి బయటపడతారా?
అజారుద్దీన్‌పై ఉన్న కేసు లు, ఆరోపణలను పట్టించుకోకుండా కాంగ్రెస్ అధిష్ఠా నం తాజాగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో ఇక ఆయ న్ను పాత కేసులన్నీ చుట్టుముడతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అజారుద్దీన్ ఆ యా కేసుల నుంచి నిష్కళంకుడిగా, సచ్ఛీలురుగా బయటపడితే తప్ప ఆయ నపై విశ్వాసం తిరిగిరాదని చెప్తున్నారు. ఆయనపై ఉన్న కేసులన్నీ అవినీతి, ఆర్థికపరమైన లావాదేవీలే కావడంతో మంత్రిగా ఆయన కొనసాగిం పుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అజారుద్దీన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి మైనారిటీ సంక్షేమం, క్రీడల శాఖలను కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆయా శాఖల మంత్రిగా రూ. వేల కోట్ల బడ్జెట్‌ను ఎలా నిర్వహిస్తారనే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత చరిత్ర మొత్తం అవినీతి, అక్రమ సంపాదన, ఆర్థిక లావాదేవీలు, సీబీఐ, ఈడీ కేసులతో కూడుకున్నది కావడంతో అజారుద్దీన్ ఇకనైనా ఆరోపణలు, కేసుల బాటలోనే నడుస్తారా లేక వాటన్నింటికీ దూరంగా ఉంటారా అనే చర్చ ప్రజల్లో జరుగుతున్నది.
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో
-అవినీతి ఆరోపణలు, క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం సిఫార్సు చేయడం అనైతికం, చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం. ఈ అంశంపై వచ్చిన ఫిర్యాదుతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి పెండింగ్‌లో పడింది. అలాంటిది ఇప్పుడు అదే వ్యక్తి ని మంత్రిగా నియమించడం ఎంతవరకు సమంజసమని కొందరు ప్రశ్నిస్తున్నారు.
-అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా 2020 23 వరకు కొనసాగారు. ఆ సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటిపై రాచకొండ పోలీసులు నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎఫ్‌ఐఆర్ నంబర్ 1137/2023 ప్రకారం అజారుద్దీన్ హెచ్‌సీఏ పరిధిలో ఫైర్ ఫైటింగ్ పరికరాలు సమకూర్చుకునేందుకు బహిరంగ మార్కెట్ కన్నా 248 శాతం అధిక ధరలకు వేసిన టెండర్ వేశారనేది ఆరోపణ. దీనిపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 406, 409, 420, 465, 467, 471, 120బీ కింద కేసులు నమోదయ్యాయి.
-ఎఫ్‌ఐఆర్ నంబర్ 1138/2023 ప్రకారం.. అజారుద్దీన్ ‘సారా’ స్పోర్ట్స్‌తో కుట్రపూరితం గా ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా హెచ్‌సీ ఏకు రూ.57 లక్షలు నష్టం వాటిల్లింది. ఆ యనపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 406, 409, 420, 465, 467, 471, 120బీ ప్రకారం కేసులు నమోదయ్యాయి.
-ఎఫ్‌ఐఆర్ నంబర్ 1139 /2023 ప్రకారం.. అజారుద్దీన్ అనేక కంపెనీలతో కుట్ర పూరితంగా ఒప్పందాలు కు దుర్చుకున్నారు.
-ఎఫ్‌ఐఆర్ నంబర్ 1140 /2023 ప్రకారం.. అజారుద్దీన్ ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడ్డారు. సుమారు రూ.3.85 కోట్ల మేర అవినీతి జరిగింది. మనీ ల్యాండరింగ్ కూడా ఉందం టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) సమ న్లు జారీ చేసింది. దీనిపై అక్టోబర్ 2024లో అజారుద్దీన్ విచారణకు హాజరయ్యారు. ఈడీ ఈక్రమంలో హెచ్‌సీఏ కార్యాల యంలో దాడులు చేపట్టి రూ.10.39 లక్షల నగదును స్వాధీ నం చేసుకుంది. అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగిన సమయం లో మొత్తం రూ. 20 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి.
-రూ.20.96 లక్షల ఏయిర్ టిక్కెట్ల మోసం సంఘటనపై ఔరంగాబాద్ సిటీ చౌక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. 420, 406, 34 ఐపీసీ కింద 22 జనవరి, 2020న ఎప్‌ఐఆర్ అయినట్టు బీజేపీ నేత గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.
-తెలంగాణ హైకోర్టులో 2022 ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదనే పిటిషన్ 2023 ఏప్రిల్‌లో విచారణకు రాగా.. అజారుద్దీన్ సమర్పించిన అఫిడవిట్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మరింత స్పష్టంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
-తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ధిక్కరణ నోటీసుపై అజారుద్దీన్ 2023 జూలైలో సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఇప్పటి కీ పిటిషన్ కోర్టులో పెండింగులో ఉంది.
-ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో 2023 అక్టోబర్ 18న రూ.3.85 కోట్ల నిధుల గోల్‌మాల్‌పై అజారుద్దీన్‌పై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. ఈ కేసులో ఆయన యాంటిసి పేటరీ బెయిల్ తీసుకున్నారు.
-హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ ఆదేశాలతో స్టేడియంలో తన పేరును తొలగించడంపై హైకో ర్టు స్టే ఇచ్చింది. ఈ అంశం కూడా ఇప్పటికీ విచారణలో ఉంది.
మ్యాచ్‌ఫిక్సింగ్, ఇతర ఆరోపణలు
F2000లో అజారుద్దీన్ భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహిస్తున్న సమయంలో ఆయనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో అజారుద్దీన్ రూ.50 లక్షలను బుకీల నుంచి తీసుకున్నారని గుర్తించింది. అదే సమయంలో అజారుద్దీన్‌కు అండర్‌వరల్డ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని కూడా తెలిపింది.
F2000 నవంబర్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ అజహరుద్దీన్‌పై నిషేధం విధించింది. దీనిపై ఆయన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ ఉంటంకించిన అంశాల ఆధారంగా న్యాయస్థానం అజారుద్దీన్‌పై నిషేధాన్ని సమర్థించింది. దీనిపై 2003 ఏప్రిల్‌లో మళ్లీ అజారుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. నిషేధం నిబంధనల ప్రకారం లేదని చెప్తూ కింది కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
Fఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో 2011లో అజారుద్దీన్‌పై రూ.1.5 కోట్ల చెక్‌బౌన్స్ కేసు నమోదైంది. ఈ కేసును అజారుద్దీన్ కోర్టు వెలుపల రూ.15 లక్షల జరిమానాతో పరిష్కరించుకున్నారని గవర్నర్‌కు నాడు ఓ బీజేపీ నేత ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నాడు.




