17 April, 2026 | 1:48 PM

Breaking News

జూబ్లీహిల్స్‌లో కింగ్ అవుతాం!

04-11-2025 01:43 AM

-సర్వేలను మేము నమ్మం

-అజార్‌కు మంత్రి పదవి ఇవ్వడం మాకు ప్లస్ పాయింట్

-ప్రజల మధ్యకే రాని కేసీఆర్ సీఎం ఎలా అవుతారు?

-లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం ముస్లింలు పోటీ చేస్తే... ఆపే దమ్ము సీఎంకు ఉందా?

-ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఒప్పందం కుదిరింది

-మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చిట్ చాట్

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాం తి): ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ ఉంటుంది. మేము కింగ్ మేకర్ కాదు.. కింగ్ అవుతాం’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సర్వేలను తాము నమ్మబోము, ప్రజల మధ్యకే రాని కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతారని అన్నారు. తెలంగాణ లో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ లేదన్నారు. కాం గ్రెస్ పార్టీ అజారుద్ధీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం తమకు ప్లస్ పాయింటని, మహిళలకు ఫ్రీ బస్సు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు.

కాంగ్రెస్ ఓడిపోతే పథకాలు ఆగిపోతాయని అననడం హాస్యాస్ప దమని, ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం టేకోవర్ చేసిన కొత్త డీపీఆర్ ఇంకా పంపలేద న్నారు. జూబ్లీహిల్స్‌కు, పాకిస్తాన్‌తో లింకు పెట్టడం ఏమిటని ప్రశ్నంచారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నీ మద్దతిస్తున్నాయన్నారు. కవితది ఆస్తులు, అధికారం, పదవులు, కుటుంబ సమస్య అన్నారు. 42 శాతం రిజర్వేషన్లలో బీసీలు ఎంత మంది ఉన్నారని, అందులో పది శాతం ముస్లిములే ఉన్నారన్నారు.

ఢిల్లీలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పా రు. బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా గెలు పు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి, విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశా రు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 

జూబ్లీహిల్స్‌లో ట్రైయాంగిల్..

టీడీపీ, జనసేన కార్యకర్తలు, సానుభూతిపరులు తమతో కలిసే పనిచేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. అలా అని వారితో తాము జత కట్టుకుని ఏం తిరగడం లేదన్నారు. జూబ్లీహిల్స్‌లో త్రిముఖ పోరు ఉంటుందని, మూడు పార్టీలకు ఓట్లు షేర్ అవుతాయని, కానీ తాము కింగ్ మేకర్ కాకుండా కింగ్ అవుతామని ఆయన చెప్పారు. సర్వేలను తాము నమ్మమని, తాము ఎలాంటి సర్వేలూ చేయలేదని, సర్వే చేసిన వారు బెడ్రూంలో ఉండి చేశారో.. ఎక్కడ ఉండి చేశారో అనేది ఎవరికీ తెలియదని విమర్శించారు.

రాజకీయ పార్టీ ్ల ఎవరికి వారు గెలవాలని కోరుకోవడంలో తప్పులేదని, కానీ దేశాన్ని కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్‌కు ఓడిపోతే రేషన్ బియ్యం ఇవ్వడం ఆగిపోతుందని చెప్పడం దారుణమన్నారు. సన్నబియ్యంలో కేంద్రం ఇచ్చేవి రూ.42 ఉంటే, రాష్ట్రానివి రూ.13 మాత్రమే ఉన్నాయన్నారు. ‘ఉద్యోగులకు ఇచ్చేందుకు డబ్బుల్లేక సీఎం నన్ను కోసి నా రూపాయి లేదని చెప్పడం సిగ్గుచేటు’ అని అన్నారు. తమ అభ్యర్థి దీపక్ రెడ్డికి మంచి స్పందన వస్తోందని, తప్పకుండా విజయం సాధిస్తామని తెలిపారు. 

అజారుద్దీన్ వల్ల ఓట్లు వస్తాయంటే పొరపాటే..

అజారుద్దీన్ వల్ల ఓట్లు వస్తాయని భావిస్తే టికెట్ ఆయనకే ఇచ్చేవారని, ముస్లింలపై ప్రేమతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని, కేవలం ఒక సామాజిక వర్గం ఓట్ల కోసమే ఇచ్చారని చెప్పారు. ఆయనపై కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని, అయినా అజార్ కు మంత్రి పదవి ఇవ్వడం ‘మాకు ప్లస్ అవుతుంది’ అని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్.. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయాక ఎక్కడ కూడా ప్రజల్లో కనిపించడం లేదని, ఆయన సీఎం ఎలా అవుతారని అన్నా రు.33 జిల్లాల్లో 32 జిల్లాలకు హైవేలు సాంక్షన్ అయ్యాయని తెలిపారు. 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎక్కడిచ్చారు?

బీసీ రిజర్వేషన్లు అమలవ్వాలంటే 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. కాంగ్రెస్ ఎన్నో ఏళ్లు పాలించింది కదా.. మరి అప్పుడు ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. ‘దేశమంతా జనగణన చేశాక దాని ఆధారంగా మేం అమలుచేస్తాం’ అని చెప్పారు. 42 శాతంలో 10 శాతం ముస్లింలకు ఇస్తున్నారని, లోకల్ బాడీ లో 42 శాతంలో కూడా ముస్లింలు పోటీ చేస్తున్నారు. దీన్ని ఆపే దమ్ము సీఎంకు ఉం దా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం విచారణ అంశం కోర్టులో ఉందన్నారు. తన లోక్ సభ పరిధిలో జరిగే ఎన్నిక కాబట్టి తాను పూర్తిస్థాయిలో పని చేస్తున్నాని చెప్పారు. మిగతావా రు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు.

రెండు దశల్లో జనగణన

2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు రెండు దశల్లో జనగణనను కేం ద్రం చేపడుతుందన్నారు. హౌస్ లిస్ట్, హౌస్ షెడ్యూల్, జనాభా లెక్కలు, కులాల వారీగా గణన, వ్యక్తిగత సమాచారం ద్వారా సెన్సస్ జరగనుందని తెలిపారు. పూర్తిగా డిజిటల్ రూపంలో డేటాను అందిస్తామన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తుల కొట్లాట, పదవు ల కొట్లాట జరుగుతోందన్నారు. ఆమెకు తమ పార్టీకి ఏం సంబంధమన్నారు. డాడీ, డాటర్ ఇష్యూ అది.. వారు వారు తేల్చుకోవాలన్నారు. కవిత ఎవరిని తిట్టాలని ఎవరిని తిడుతుందో వారికే తెలియాలన్నారు. 

మా పార్టీకి రావాలంటే రాజీనామా చేయాలి

పార్టీ ఫిరాయింపుల చట్టానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తూట్లు పొడిచాయని విమ ర్శించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నానని అన్నారు. తమ పార్టీలోకి రావాలనుకుంటే రాజీనామా చేయాలని చెప్పారు. రాజాసింగ్ విషయంపై తాను కామెంట్స్ చేయదలుచు కోలేదని, సినీ కార్మికులతో సీఎం మీటిం గ్ పెట్టినంత మాత్రాన వాళ్లు ఓట్లేస్తారా? అని ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీలో అందరినీ తాము కలుస్తున్నామన్నారు. చిరంజీవి మోదీ అభిమాని.. కానీ ఈ ఉప ఎన్నికపై ఆయనతో మాట్లాడలేదన్నారు. బీహార్ ఎలక్షన్‌లో వందకు వంద శాతం గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎంఐఎం 7 అసెం బ్లీ సీట్లు, ఒక ఎంపీ స్థానానికి మించి పోటీ చేయదని, అయితే రాష్ట్రంలో తప్ప దేశమంతా పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.