9 April, 2026 | 1:14 PM

పదేళ్లలో పీసీసీ చీఫ్, సీఎం అవుతా

29-06-2024 12:36 AM
  1. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
  2. మోదీ పాలనలో 100 ఎమర్జెన్సీలు జరిగాయని ఆరోపణలు
  3. 50ఏళ్ల నాటి ఎమర్జెన్సీతో దివాళాకోరు రాజకీయాలంటూ విమర్శలు

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : పీసీసీ అధ్యక్షుడి విషయంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా.. తాను పార్టీకి విధేయుడిగానే నడుచుకుంటానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్ అటెండర్‌గా చేయడానికైనా సిద్ధంగా ఉంటానని అన్నారు. పీసీసీ చీఫ్ ఎన్నిక విషయంలో తనను ఎవరు కూడా సంప్రదిం చలేదని భవిష్యత్‌లో మాత్రం పీసీసీ అధ్యక్షుడితో పాటు ముఖ్యమంత్రిని కూడా అవు తానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో పీసీసీ ఫిషర్ మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయితో కలిసి మీడియాతో మాట్లాడారు.

ప్రధాని మోదీ, బీజేపీ పదేపదే ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతోందని, అదే బీజేపీ విషయానికి వస్తే వంద ఎమర్జెన్సీల గురించి చెప్పవచ్చన్నారు. 50 ఏళ్ల కిందటి ఎమర్జెన్సీ సమయంలో బీజేపీ పుట్టలేదన్నారు. ఎమర్జెన్సీ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ 353 సీట్లలో గెలిచిందన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. బంగ్లాదేశ్ తరపున పాకిస్తాన్‌పై యుద్ధం చేసినప్పుడు ఇందిరమ్మను దుర్గమ్మ తల్లిగా వాజ్‌పేయ్ కొనియాడారని గుర్తు చేశారు. చైనా ఆధీనంలో ఉన్న మన భూమిని యు ద్ధంతో తిరిగి స్వాధీనం చేసుకున్న సంగతి తెలుసుకోవాలని సూచించారు. ఇందిరాగాంధీ ఏమి చేసినా గుండె ధైర్యంతోనే చేశా రని పేర్కొన్నారు. 

మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే గోద్రా అల్లర్లలో 2వేల మంది చనిపోయారని తెలిపారు. దేశ భక్తులంటున్న బీజేపీ పుల్వామా ఘటనపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చ పెట్టడం లేదని ప్రశ్నించారు. నల్ల చట్టాలతో రైతులను హింసించిది వాస్త వం కాదా అని సవాల్ చేశారు.  బీజేపీకి చెప్పుకోవడానికి ఏ చరిత్ర లేక 50 ఏళ్ల క్రితం జరిగిన అంశంతో రాజకీయం చేయాలనుకోవడం దివాళాకోరుతనమని విమ ర్శించారు. సోనియా, రాహుల్‌కు కాంగ్రెస్‌లో  రాజకీయాలకు శాశ్వతంగా అధికారం ఉంటుందని, అదె మోదీకి తాత్కాలికమేనని పేర్కొన్నారు.