జయమ్మకు ప్రేమతో..!

14-09-2026 | 05:30am

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’(Ranabali). ఈ చిత్రంలో రష్మిక రణబాలి జోడీగా జయమ్మ క్యారెక్టర్‌లో నటిస్తోంది. తాజాగా ఆమె పాత్ర షూటింగ్ పూర్తయింది. షూటింగ్ సెట్ నుంచి చిత్రబృందం ఎమోషనల్‌గా ఆమెకు సెండాఫ్ ఇస్తున్న వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం (Director Rahul Sankrityan)వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విజయదశమి సందర్భంగా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్ డీవోపీ: నీరవ్ షా, జిష్ణు భట్టాచర్జీ; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్; ఆర్ట్: విఠల్ కోసనం.  

మరిన్ని వార్తలు