ఎలక్ట్రిక్ బైక్ పేలి మహిళ మృతి
27-06-2025 10:30 AM
అమరావతి: కడప జిల్లాలో(Kadapa District) యర్రగుంట్ల మంండలం పొట్లదుర్తిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటీకి(Electric Scooter) చార్జింగ్ అవుతుండగా పేలుడు సంభవించింది. స్కూటీ పేలుడు సమయంలో పక్కన నిద్రిస్తున్న మహిళ మృతి చెందింది. మృతురాలిని వెంకటలక్ష్మమ్మ(62)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.






