8 August, 2026 | 9:47 AM

యువతి అదృశ్యం

08-08-2026 08:53 AM

ఘట్ కేసర్,(విజయక్రాంతి) : ఓ యువతి అదృశ్యమైన సంఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మధు చందు అస్తానే, అనిత అస్తానే, ఘట్ కేసర్ పట్టణంలోని బుగ్గానగర్ లో నివాసం ఉంటున్నారు. కుమార్తె రోషిణి అస్తానే (20) ఘట్‌కేసర్‌లోని కృష్ణ మార్ట్ లో ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 6న గురువారం ఉదయం 9గంటలకు విధులకు వెళ్లిన రోషిణి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె మొబైల్ నంబర్లలకు పలుమార్లు సంప్రదించగా రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో, ఆమె పనిచేసే స్థలం, పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు.  

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. రోషిణి అస్తానే ఎత్తు 5 అడుగులు 3 అంగుళాలు, ఇంటి నుండి వెళ్లిన సమయంలో పింక్ అండ్ వైట్ రంగు టాప్, పింక్ రంగు ప్యాంట్  ధరించి ఉందన్నారు. కావున యువతి ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ లో లేదా డయల్ 100 / 112కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.