03-02-2026 09:05:00 PM
హనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ.అప్పయ్య
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.రామలింగం సూచన మేరకు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ సమన్వయంతో వడ్డేపల్లిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో అంతర్జాతీయ కాన్సర్ దినోత్సవంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య, డిప్యూటీ లీగల్ ఎయిట్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం. కవిత, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ కే.రవిలు పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ మారుతున్న జీవన శైలి కారణంగా క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఎన్సిడి కార్యక్రమంలో భాగంగా 30 సంవత్సరాల పైబడిన వారిని స్క్రీనింగ్ చేసి లక్షణాలున్న వారిని వ్యాధి నిర్ధారణ కోసం రిఫరల్ సెంటర్ కి పంపించడం జరుగుతుందని, జిల్లాలో 692 క్యాన్సర్ కేసులను గుర్తించడం జరిగిందని, ప్రభుత్వం కూడా క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షలతో పాటు ప్రజలకు వివిధ రకాల క్యాన్సర్ల పై అవగాహన కూడా కలిగించడం జరుగుతుందన్నారు.
త్వరలో ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. పురుషులలో కంటే ఆడవారి లోనే కాన్సర్ బాధితులు ఎక్కువ ఉన్నారని, వారికీ ఆశ వర్కర్ల ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళు తీసుకునే ఆహారం గురించి తెలియజేయాలి. 6 నెలలకు ఒక్కసారి కాన్సర్ పరీక్షలు చేయించు కోవాలి.14 నుండి 18 సంవత్సరాలు కలిగిన బాలికలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కాన్సర్ వాక్సిన్ ను, ప్రభుత్వ వైద్య శాలలో అందుబాటులోకి తీసుకు వచ్చారు.
అంకాజీ స్పెషలిస్ట్స్ అన్ని వైద్యశాలలో అందుబాటులో ఉన్నారని, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్సె కౌన్సెల్స్ , ఏ కిరణ్ సింగ్, కే. రవి, జి. శ్రీనివాస్ రావు, ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్, పి.మాలిక, మెడికల్ ఆఫీసర్, డిఈఏంఓ వి.అశోక్ రెడ్డి, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంఎస్ లు తదితరులు పాల్గొన్నారు.