03-02-2026 09:07:55 PM
మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సోమవారం నిర్వహించిన సోషల్ టాలెంట్ టెస్ట్ లో మంథని మండలోని ఆరెంద ప్రభుత్వ పాఠశాలలో లో 10వ తరగతి చదువుతున్న దూడపాక అక్షర జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి ప్రతిభను చాటింది. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన అక్షరను ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ కు ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా ఆరెంద హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఈదులపల్లి నరసింహ రావు అక్షరను అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు అక్షరను సిద్ధం చేస్తున్నామని సోషల్ టీచర్ బెజ్జల శ్రీలత తెలిపారు. అలాగే ప్రథమ స్థానం సాధించిన అక్షరను ఉపాధ్యాయులు సువార్త, మమత, గియాశుద్ధిన్, పద్మజ, శ్రీవాణి, శ్రీలత, సహేందర్, అమన్ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అక్షర రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ఫలితం సాధించాలని వారు ఆకాంక్షించారు.