ఏఎస్‌రావు నగర్‌లో మహిళా దినోత్సవ వేడుకలు
ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కార్పొరేటర్
కుషాయిగూడ మార్చి 18 (విజయ క్రాంతి) : కాప్రా సర్కిల్ డాక్టర్ ఏఎస్ రావు నగర్ మహిళా మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజం సుస్థిరంగా అభివృద్ధి చెందాలంటే మహిళా సాధికారత ఎంతో అవసరమన్నారు.
విద్య, ఉపాధి, రాజకీయాలు, సామాజిక సేవ వంటి అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతూ సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నారని కొనియాడారు. మహిళలంతా ఐక్యంగా ఉండి తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు డి. విజయ, ఉపాధ్యక్షురాలు పి. సు వర్ణ, కార్యదర్శి రంజనా మలాకర్, సంయుక్త కార్యదర్శి వై.డి. నిర్మల, కోశాధికారి పి. నాగలక్ష్మి, సభ్యు లు కమల, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.




