25 May, 2026 | 3:31 AM

25 నుంచి 30 వరకు మహిళా ఆర్థిక వారోత్సవం

25-05-2026 02:00 AM
  1. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలి
  2. కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, మే 24 (విజయక్రాంతి) : మహిళా ఆర్థిక వారోత్సవాన్ని మే 25 నుంచి 30 వరకు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆదివారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 25 నుండి 30 వరకు జిల్లాలో మహిళా ఆర్థిక వారోత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.  మే 25న అన్ని ALFs, TLFs స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మహిళా ఆర్థిక వారో త్సవంపై అవగాహన కల్పించనున్నారు.

మే 26 నుండి 30 వరకు మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తుల ప్రదర్శనలు, బ్యాంక్ లింకేజీ కార్యక్రమాలు, రుణ మేళాలు, డిజిటల్ లావాదేవీలపై అవగాహన, మార్కెటిం గ్ అవకాశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహిళా వ్యాపారవేత్తలకు అవసరమైన రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు, ప్రభు త్వ పథకాల అనుసంధానంపై ప్రత్యేక సహా యం అందించనున్నారు. మే 27న మహిళా వ్యాపారవేత్తలకు  మున్సిపాలిటీలలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సేవలు అందించనున్నారు.   మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడే ఈ వారోత్సవ కార్యక్రమాలను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, మెప్మా పీడీ హనుమంతరెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ నరసింహు లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.