10 March, 2026 | 1:13 AM

మహిళలకు ఘన సన్మానం

09-03-2026 06:16 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో మహిళలకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా ముఖ్య అతిథిగా పాల్గొని బావుసాయిపేట గ్రామ సర్పంచ్ యాస్మిన్ పాషా, పంచాయితీ కార్యదర్శి రాధిక, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లను శాలువాలు కప్పి సన్మానించి మెమెంటోలు అందజేశారు.

ఈ సందర్భంగా షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారు అన్ని రంగాల్లో ముందుండి రాణించాలని అన్నారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం, పార్టీ తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మహిళలకు సమాజంలో మరింత గౌరవం, అవకాశాలు లభించేలా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తిక్కల నవీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భైరగోని నందు గౌడ్, వార్డు సభ్యులు గంగాధర్, అక్షయ్, రమేష్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.