10 March, 2026 | 11:56 AM

సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన

09-03-2026 06:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవి ఉన్నత పాఠశాల దగ్గర గల పార్కులో నిర్మల్ మున్సిపల్ కమీషనర్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ వాసవి విద్యార్థులకు సేంద్రీయ ఎరువుల తయారీ విధానాన్ని గురించి అవగాహన కల్పించారు. మన ఇంట్లో కుళ్ళి పోయిన పండ్లు కూరగాయలను, మన ఇంటి పరిసరాలలోని చెట్ల నుండి పడిన ఆకులతో సేంద్రీయ ఎరువులను తయారు చేసుకోవచ్చని విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ కమీషనర్ శ్రీ జగదీశ్వర్, ప్రిన్సిపాల్ ఎం.రాజ్ కుమార్, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.