calender_icon.png 12 February, 2026 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని లో లేబర్ కోడ్స్ రద్దుకై కదం తొక్కిన కార్మిక లోకం

12-02-2026 04:20:39 PM

మంథని,(విజయక్రాంతి): దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం మంథని పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యోగ కార్మికులు కదం తొక్కారు. మంథని మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీ ప్రదర్శనతో తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రజాస్వామికంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని గ్రామీణ ప్రాంతాలలో పేదలకు ఆసరగ ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తొలగించడం చాలా అన్యాయమని అన్నారు.

జి రాంజీ పథకాన్ని రద్దుచేసి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే 2025 విద్యుత్ సవరణ బిల్లును రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని, అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని మున్సిపల్ గ్రామపంచాయతీ కార్మికుల పర్మినెంట్ చేసి, కానీస వేతనం అమలు చేయాలని కోరారు. హాస్పిటల్ కార్మికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేతనాలు పెంచి నెల నెల నేరుగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గొర్రెంకల సురేష్, సీఐటీయూ నాయకులు మల్లేష్, చందు గట్టయ్య, భాగ్య, పోచమ్మ, సుగుణ, సుజాత, భాగ్య, రజిత, శ్రావణ్, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.