calender_icon.png 12 February, 2026 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభ్యర్థులకు కౌంటింగ్ ఫీవర్

12-02-2026 04:25:15 PM

- ఫలితాలపై ఉత్కంఠం

- గెలుపోటమీలపై బెట్టింగ్

- కౌంటింగ్ ఏర్పాట్లు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠత నెలకొంది. ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటమిపై ఎక్కడ చూసిన చర్చ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్  34 వార్డుల్లో అభ్యర్థులను రంగంలోకి దింపింది. బీజేపీ 20, సీపీఐ 6 స్థానాల్లో పోటీ చేసింది. ప్రధాన పార్టీల మధ్యనే గెలుపోటములు ఉన్నాయి. ఫలితాలు ఎలా వస్తాయని దానిపై ప్రధాన పార్టీలు చర్చించుకుంటున్నాయి. మెజార్టీ స్థానాల విజయాల పైనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఫలితాలను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఇప్పటినుంచే సమీకరణలు చేస్తున్నాయి. 

- చైర్మన్ పీఠంపైనే కన్ను..

మున్సిపల్ పరిపాలన పగ్గాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రధాన దిష్టి పెట్టాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రివ్యూలు, ప్రతివ్యూహాలు చేస్తున్నాయి. మెజార్టీ స్థానాల పైనే భారం  వేసుకున్నాయి. ఒక వేళా తక్కువ స్థానాలు వస్తే ఏమి చేయాలనే ఇప్పటి నుంచే వ్యూ హాల్లో ఉన్నారు. చైర్మన్ పగ్గాలు చేపట్టేందుకు గెలిచిన అభ్యర్థులను కొనేందు కూడా వెనుకాడడంలేదు.. భారీ ప్లాన్లు చేస్తున్నారని తెలుస్తోంది. గెలిచే అభ్యర్థులను ముందే గుర్తించి వారిని మంచిక చేసుకొని టచ్ లో ఉంచుకుంటున్నారు. 

ప్రధానంగా గెలుపు దిశలో కనిపిస్తున్న ఉన్న కాంగ్రెస్ రెబల్స్ అభ్యర్థులపై దృష్టి పెట్టారు. వారిని మలుచుకునేందుకు ప్రలోబపెడుతున్నారు. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను సహితం చేరవేసే పనిలో ఉన్నారు. ఏమి చేసైనా సరే.. బెల్లంపల్లి బల్దియాపై విజయ కేతనం ఎగురు వేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెగపోటీ పడుతున్నాయి. అందుకోసం చైర్మన్ అభ్యర్థులను  ఇప్పటికే ఎంపిక చేసుకున్నారని ప్రచారం ఉంది. కౌంటింగ్ లో వెల్లడయ్యే ఫలితాలు అనుకూలంగా వస్తే ముగ్గులోకి దిగుతారు. తమ అమ్ములపొది లోని రహస్య వ్యూహాలకు పనిపెడుతారు. విజయాలు ఏ పార్టీని వేస్తాయో మరి కొద్ది గంటల్లోనూ ఆ స్పెన్షన్ కు తెరపడుద్దు.