2 June, 2026 | 1:37 AM

3న నగరంలో ప్రపంచ సైక్లింగ్ ర్యాలీ

02-06-2026 12:41 AM

ముకరంపుర, జూన్ 1 (విజయ క్రాంతి): ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 3న కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్, ఏ. జె. పెడల్స్ సంయుక్తంగా నిర్వహించే సైక్లింగ్ ర్యాలీలో ఔత్సాహిక సైక్లిస్టులు, సైక్లింగ్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ డా.వి. నరేందర్ రెడ్డి, అధ్యక్షులు కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డిలు కోరారు. నగరంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో సైకిల్ ర్యాలీ పోస్టర్ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 3న ఉదయం 5:30 గంటలకు తెలంగాణ చౌక్ నుంచి ఎలగందల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ర్యాలీలో పాల్గొని పూర్తి చేసిన సైక్లిస్టులకు ప్రశంసా పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన అన్ని వయస్సుల వారు ఈ ర్యాలీలో తమ సైకిల్లతో పాల్గొన వచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సురభి వేణుగోపాల్, కోశాధికారి వి.జగదీశ్వరా చారి, కార్యవర్గ సభ్యులు అఖిల్ రెడ్డి, డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్, ఎం మహెందర్, తదితరులు పాల్గొన్నారు.