17 July, 2026 | 12:27 AM

‘వరల్డ్ మిఠాయి, నమ్కీన్ కన్వెన్షన్’

17-07-2026 12:27 AM

హైటెక్స్‌టో ప్రారంభమైన పర్చేసింగ్-2026 

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): మిఠాయి, నమ్కీన్, బేకరీ పరిశ్రమలకు సంబంధించిన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సదస్సు ‘వరల్డ్ మిఠాయి అండ్ నమ్కీన్ కన్వెన్షన్ (డబ్ల్యూఎంఎన్సీ) పర్చేసింగ్ 2026’ హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగే ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న తయారీదారులు, రిటైలర్లు, సరఫరాదారులు, పరిశ్రమ నిపుణులు పాల్గొంటున్నారు.

ప్రారంభ కార్యక్రమంలో దాదూస్ మిఠాయి వాటిక మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ దాదూ, సురుచి ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి.వి.ఎస్. మల్లిఖార్జున రావు, ఆల్మండ్ హౌస్ సీఈఓ చైతన్య ముప్పాల, కరాచీ బేకరీ మేనేజింగ్ పార్టనర్ రాజేష్ రామ్నానీ, ఏఐఎం ఈవెంట్స్ నిర్వాహకులు అండ్ ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎం డైరెక్టర్ జనరల్ ఫిరోజ్ హెచ్. నఖ్వీ పాల్గొన్నారు. 300కు పైగా ఎగ్జిబిషన్ స్టాల్స్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 30 వేల మందికి పైగా వ్యాపార సందర్శకులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

కేఫ్ నిలోఫర్ అధినేత అనుముల బాబురావు, పిస్తా హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ మజీద్, ఆల్మండ్ హౌస్ ప్రతినిధి నాగార్జున ముప్పాల, బాలాజీ రతన్లాల్ మిఠాయి భండార్ ప్రతినిధి పూనంచంద్ పన్వార్, స్కూప్స్ ఐస్క్రీమ్స్ అధినేత సుధీర్ షా తదితరులు పాల్గొని సదస్సుకు మద్దతు తెలిపారు.