భక్తి శ్రద్ధలతో ఉసిరి, తులసిలకు పూజలు
ఎల్బీనగర్, నవంబర్ 2: కార్తీక మాసం సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో ఉసిరి, తులసి మొక్కలకు పూజలు చేశారు. అనంతర ఎన్జీవో కాలనీలోని గణేష్ దేవాలయంలో సుమారు 200 మంది మహిళలు సామూహిక కార్తీక క్షీరాబ్ధి ద్వాదశి పూజలు నిర్వహించారు. జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ పూజల కొరకు తులసి, ఉసిరి మొక్కలు ఉచితంగా ఇస్తూ వాటి విశిష్టతను వివరించారు. పూజారి సోమయాజులు ఆధ్వర్యంలో మహిళలు భక్తి శ్రద్ధలతో ఉసిరి, తులసి మొక్కలకు పూజలు చేశారు.
కార్యక్రమంల బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ గాయత్రి నగర్ ఫేజ్ 4 అధ్యక్షుడు మనోజ్ కుమార్ గౌరి శెట్టి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు, ప్రముఖ వాస్తు నిపుణులు, సంస్కార భారతి అధ్యక్షుడు, విశ్రాంత ఇంజినీర్ పెంటపాటి కృష్ణాదిశేషు, సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ రవికాంత్, విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ, గోపాల్ దాస్ రాము, గుద్దేటి నర్సింహులు, బుగ్గయ్య, మహిళలు పాల్గొన్నారు.






