17 June, 2026 | 8:25 PM

సత్తెనపల్లి సర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక

17-06-2026 07:16 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లి సర్పంచ్ ఆనంద్ విజయ్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఆనంద్ విజయ్ బుధవారం ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ లో ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ విధానాలు అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి ఆ పార్టీలో చేరుతున్నానని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో ఖానాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జంగిలి శంకర్ ,సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి, నవీన్, రాజు జాదవ్, బక్కన్న, తదితరులు ఉన్నారు.