17 June, 2026 | 6:53 PM

ప్లాస్టిక్ రహిత గ్రామం దిశగా ముందడుగు

17-06-2026 05:45 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల్ చాకేపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ జాంబి మౌనిక విశిష్ట నిర్ణయo తీసుకుంది. గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ముందుకెళ్తోన్నారు. అందుకుగాను ఆమె గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి బదులుగా దీర్ఘకాలం ఉపయోగపడే స్టీల్ వస్తువులను కొనుగోలు చేసి ప్రజా అవసరాలకు వినియోగంలోకి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల తగ్గుదలతో పాటు గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉండటానికి పాటుపడుతుంది.

  అలాగే ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు గ్రామపంచాయతీలో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గ్రామాన్ని “ప్లాస్టిక్ రహిత గ్రామం”గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని సర్పచ్ వెల్లడించారు. ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తపాస్ వార్డ్ మెంబర్లు జంబి కమల, జంబి భీమయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.