23 July, 2026 | 10:08 PM

యశస్వి జైస్వాల్ ఔట్

24-11-2024 11:50 AM

పెర్త్ వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచులో మూడో వికెట్ పడింది. భారీ ఇన్నింగ్స్ ఆడి రికార్డులు సృష్టించిన యశస్వి జైస్వాల్ 297 బంతుల్లో 15 పోర్లు, 3 సిక్స్ లో కొట్టి 161 పరుగులు రాబట్టాడు. మిచెల్ మార్ష్ వేసిన బౌలింగ్ లో యశస్వి స్మిత్ కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత క్రీజులో విరాట్ కోహ్లీ వచ్చాడు. మరో పక్క ఈ టెస్టులో  భారత్ పట్టుబిగిస్తోంది. ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారీ స్కోర్ దిశగా టీమిండియా దూసుకుపోతుంది.