27 June, 2026 | 11:35 PM

ఎల్లయ్య మరణం కార్మిక రంగానికి తీరని లోటు

06-09-2025 12:15 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు(సంగారెడ్డి), సెప్టెంబర్ 5 : కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఎల్లయ్య మరణం కార్మిక రంగానికి తీరని లోటని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఎల్లయ్య మరణ వార్త తెలిసిన వెంటనే అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేటలో ఎల్లయ్య నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి ఎమ్మెల్యే ఘన నివాళులు అర్పించారు.

బీహెచ్‌ఈఎల్ తో పాటు వివిధ పరిశ్రమల్లో కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం తుది వరకు పోరాడిన మహోన్నత నాయకుడు ఎల్లయ్య అని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని, భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబాన్ని పరామర్శించిన వారిలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి తదితరులు ఉన్నారు.