‘యోగం’ అంటే ఆత్మచికిత్స

26-09-2026 | 05:05am

ఈమధ్య నేను పాల్గొన్న కార్యక్రమాల్లో ఎప్పటికీ మరిచిపోలేని కార్యక్రమం ‘యోగా థెరపి(Yoga Therapy)’. ఈ కార్యక్రమం ఆగష్టు 30 నాడు గచ్చిబౌలిలోని ‘బ్రహ్మకుమారీస్ శాంతి సరోవరంలో జరిగింది. దీన్ని సంయోజనం చేసినవారు తెలంగాణ యోగా ‘టీచర్స్ కో కమిటీ’వారు.

నేను ‘సంపూర్ణ యోగదర్శనం’ సానుకలూంగా వ్యాఖ్యానించి మహ ర్షి పతంజలికి అంజలులు ఘటించాను. నా గ్రంథానికి ఎంతో ప్రాచుర్యం లభించింది. నీ శిష్యుడు పారుపల్లి కిరణ్ కుమార్ (ఎం.ఎస్సీ యోగా)ద్వారాను కార్యక్రమ సంయోజకుడైన శ్రీ దుర్గా నాగేశ్వర్ రాయ్ గారు నా గురించి తెలుసుకొని ‘యోగా థెరపీ కాంక్లేవ్ ప్రముఖ వక్తగా ఆహ్వానించాడు. 

సభకు తెలుగు రాష్ట్రాల నుం చి సుమారు ఎనిమిది వందలమంది దాకా యోగాధ్యాపకులు వచ్చారు.

శాంతి సరోవరంలో, ప్రశాంతమైన వాతావరణంలో నేను ఒక దివ్యా నుభూతికి లోనయ్యాను. అంతమంది యోగాధ్యాపకులను ఒక చోట చూడటం కొత్తగా అనిపించింది. నన్ను పరిచయం చేసిన పారుపల్లి కిరణ్ కుమార్ యోగాధ్యాపకుడు కూడా శ్రీకాకుళం నుంచి వచ్చాడు.

సభ 11 గంటల నుంచి సాయంత్రం 5 దాకా కొనసాగింది. మొదట బ్రహ్మకుమారి సిస్టర్ అంజలి(Brahma Kumari Sister Anjali) గారు ప్రసంగించారు. వారి శాంతి సందేశంతో మొదలైన ప్రసంగం ‘వీడియో ప్లే ద్వారా ను కొనసాగింది. జీవాత్మ భృకుటిలో ఉం డడాన్ని, మనం అక్కడే పరమాత్మను సాక్షాత్కరించుకోవాలని చెప్పారు. సాంసారిక కార్యకలాపాలు మనలో చింతకు దారితీస్తే, ఆధ్యాత్మికానుభవం చింతనకు దారితీస్తుందని, ఈశ్వర భక్తికి, కర్మఫల సమర్పణకు యోగ సాధకులు సన్నద్ధం కావాలని వారు చక్కగా ప్రసంగించారు.

ఆ తర్వాత న్యూరోపతి డాక్టర్ రామచంద్రరావు (సిద్ధార్థ యోగ విద్యాలయం) గారు ‘ప్రకృతి యోగిక జీవనం’ మీద మాట్లాడారు. ఆయుర్వేదం ప్రకృతి సహజమైం దని చెప్పి ప్రతిదానికి ఆసుపత్రులకు వెళ్లవలసిన పనిలేదని ప్రకృతి వైద్యంతోపాటు యోగా ద్వారా మన జబ్బులను పరిష్కరించుకోవచ్చునని, పరమాత్మ ద్వారా మన కందిన ఔషధీ సంపద గొప్పదనాన్ని, పసు పు ప్రాధాన్యాన్ని వివరించారు.

సభలో మధ్య మధ్యన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా దైవ భక్తిపరమైన పాటలు, నృత్యాలు అందరిని ఆ నందపరిచాయి. ఉదయం మాట్లాడవలసిన నాకు మధ్యాహ్నం భోజనానంతరం మాట్లాడే అవకాశం లభించింది. నాతోపాటు డా.నరహరిమూర్తి ఎం.ఎస్సీ (యోగా)గారు సభలో ఉన్నారు. నిజానికి సభకు వచ్చిన వారందరూ వారి ప్రసంగం ‘యోగా థెరపీ’పై ఒక నెల రోజులు ‘జూమ్’లో వరుసగా ప్రతిరోజూ గంటన్నర సేపు విన్నవారే. వారిని అంతకుముందు ఎవరూ చూసి ఉండరు. వారి శిక్షణలో పా ల్గొన్న వారందరికీ డా. నరసహరి మూర్తిగారే విజయ పత్రాలందజేశారు.

వారిలో ఫోటో కార్యక్రమం సంబంధంగా సాగింది. వారు పతంజలి యోగా సూత్రాలపై చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకున్నది. నాకు మధ్యాహ్నం 3 గంటలకు ప్రసంగించే అవకాశం లభించింది. యోగ దర్శనం షడ్ద ర్శనాల్లో 4వది. సాంఖ్యం ‘థియరీ’ కాగా యోగ దర్శనం ప్రయోగంగా భావింపబడుతుంది. సాంఖ్య దర్శనం ప్రకృతి పురుష వివేకాన్ని కల్గిస్తే, యోగ దర్శనం పరమా త్మ సాక్షాత్కారానికి హేతువవుతుంది. అ ష్టాంగయోగం కష్టాంగయోగంగా కాక, ఇష్టాంగ యోగంగా సాగాలి. పతంజలి సూచించిన యమనియమాలు మానవుని జీవితాన్ని సుఖమయం చేస్తాయి. అహిం సా, సత్యం, అస్తేయం (దొంగ పనిచేయకుండా ఉండటం) బ్రహ్మచర్యం, అపరిగ్ర హం (సంపదను ఎక్కువగా దాచుకోకుం డా ఉండడం) అనే యమాలు మానవుణ్ణి సామాజికుణ్ణి చేస్తాయి.

అట్లే శౌచం (శుచి), సంతోషం, తపస్సు (శీతోష్ణ సహిష్ణుత), స్వాధ్యాయం (వేదాది గ్రంథాలను పఠించడం), ఈశ్వర ప్రణిధానం (మనకర్మ ఫలాలను పరమాత్మకర్పించడం) మొదలైన నియమాలు మానవుణ్ణి వ్యక్తిగతంగా శ్రేష్ఠుణ్ణి చేస్తాయి. అష్టాంగ యోగానికి సం బంధించిన యమ నియమాలు ప్రాథమికంగా మోక్ష తీరానికి చేరడానికి చక్కని సోపానాలు. యోగాధ్యాపకులు కేవలం ఆసన ప్రాణాయామాలకు మాత్రమే పరిమితం కాక, ధారణ ధ్యాన, సమాధుల విషయంలో అనుభవం కల్గి ఉండాలి. యోగ క్రియ అంటే ఆత్మచికిత్స. యోగం ద్వారా మృత్యువును జయించి అమృతత్వాన్ని పొందవచ్చు.

ధ్యానంలో మన నాలుకను, పరమాత్మ ముఖ్య నామమైన ఓంకా రంతో అనుసంధానం చేయాలని. మనస్సును పరమాత్మ స్వరూపంలో అను సంధానం చేయాలి. అట్లే ఏక కాలంలో ఆత్మను పరమాత్మతో అనుసంధానం చే యాల్సిన పరమాత్మను అంతటా చూసేవారికి సంశయాలుండవు. వేదాలు పర మాత్మను గూర్చి చెప్పగా, ఉపనిషత్తులు మనల్ని పరమాత్మకు సమీపంలో కూర్చొనేలా చేస్తాయి. యోగదర్శనం మనకు పర మాత్మ సాక్షాత్కారాన్ని కల్గిస్తుంది. పతంజలి పాణిని వ్యాకరణానికి భాష్యం రాసి వాక్షుద్ధిని, చరక సంహితకు వ్యాఖ్యానం రాసి దేహశుద్ధిని, యోగదర్శనాన్ని రాసి చిత్తశుద్ధిని కల్గించినాడు. 

మనకు పరమాత్మ నూరేళ్ల ఆయుష్యు ఇచ్చాడు. జీవన్ముక్తులైన యో గులు నూరేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తారు. మా గురువుగారు పండిత గోపదేశశాస్త్రి యోగబలం చేత 101 సంవత్స రాలు జీవించాడు. పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి కర్మయోగం, ఆత్మసాక్షాత్కారానికి జ్ఞానయోగం తోడ్పడుతాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కేవలం కర్మయోగులే కాదు, జ్ఞాన యోగులు. గీత “అశాంతస్యకుతః సుఖమ్?” అని చెప్పిన దాన్ని బట్టి శాంతి లేనివారికి సుఖంలేదని తెలుస్తుంది.

ఈ శాంతి అనేది యోగం వల్లనే సాధ్యమవుతుంది. వేదం ‘మనుర్భవ’ అం టుంది. మనిషిని కమ్మనిదాని అర్థం. కాని గీత ‘యోగీభవ’ అంటుంది. యోగి కావడమే మానవుని జీవితలక్ష్యం. మోక్షం సం సార వృక్షానికి ఫలం. యోగ సాధకులు ప్ర పంచాన్ని ఉపయోగించుకోవడంతోపాటు పరమాత్మను ఉపాసిం చడం తెలుసుకోవాలి. అందుకు ముందు కఠోపనిషత్తు “ఉత్తిష్ఠ, జాగ్రత, ప్రాప్యవరా న్ నిబోధత” అంటుంది. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు సాగుము. మంచిగురువును ఎన్నుకొని ముందుకు వెళ్లుము అని దాని అర్థం. 

మనం వేదం ప్రకారం పరమాత్మతో ఎల్లప్పుడూ కలిసే ఉన్నాం “సమాధి సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూప తా” అని సాంఖ్యనం చెప్పిన దాన్ని బట్టి జీవాత్మ సమాధిలోనూ, నిద్రలోను, మోక్షంలోను పరమాత్మతో సమానుడవుతాడని తెలుస్తుంది. జీవాత్మ పరమాత్మను చేరుకోవడానికి యోగమార్గమే ఉత్తమమైంది. దీనినే కఠోపనిషత్తు ‘శ్రేయోమా ర్గం’ అన్నది. 

మనదేశంలోని హిమాలయాలను ఉన్నచోటు నుంచి ఎక్కడికీ పం పించలేం కాని, యోగం ప్రపంచమంతటా విస్తరించే అవకాశం ఉంది. లోకులు సం సారంలో చిక్కి ఆగం కాకుండా ఉండాలంటే ‘యోగం’ ఒక్కటే చక్కని ఉపాయం అని నేను ఒక 40 నిముషాలు చేసిన ప్రసంగానికి ఆహూతుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకే నేను పాల్గొన్న కార్యక్రమాల్లో కెల్లా ఇది అద్భుతమైందని చెప్పడానికి సాహసిస్తున్నాను. 

 వ్యాసకర్త సెల్: 9885654381

ఆచార్య మసన చెన్నప్ప 

మరిన్ని వార్తలు