1 March, 2026 | 9:03 AM

విద్యను భ్రష్ఠుపట్టించిందే మీరు!

01-03-2026 12:00 AM

కేసీఆర్ కంటే రేవంత్‌రెడ్డి వెయ్యి రెట్లు నయం

మాజీ మంత్రి హరీశ్‌రావుకు కౌంటరిచ్చిన విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): తెలంగాణలో పది సంవత్సరాల పాలనలో ప్రభుత్వ విద్యను భ్ర ష్ఠుపట్టించిన మీకు విద్య గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీమంత్రి హరీశ్ రావుకు తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి విమర్శించారు. శనివా రం ఎక్స్ వేదికగా హరీశ్‌రావుకు కౌంటరిచ్చారు. ’కమిషన్ రిపోర్ట్ మీరు మొదటి పేజీ కూడా చదవనట్టుంది.

అందుకే అందులో ఉన్న విషయాల మీద రాయకుండా మా టీం విద్యార్హతల మీద ప్రజలకు తప్పుడు సమాచా రం ఇవ్వడమేంటి బాబు? మమ్మల్ని అడిగితే మా అం దరి సీవీలు ఇచ్చేవాళ్లం కదా!. మా ఆఫీస్ టీంలోనే ఆరుగురు పీహెచ్‌డీ కలిగి, అందరూ టీచింగ్ అనుభవం ఉన్న వాళ్లే. ఒకరు ఎన్‌ఐటీ, ఒకరు ఐఆర్‌ఎంఏ, ఒకరు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఉన్నారు. 22 మంది ప్రొఫెసర్లందరూ విద్యానిపుణులు, టీచింగ్ అనుభవం ఉన్న వాళ్లే. ఆకునూరి మురళి ఒక్కడు రిపోర్ట్ రాయడు.

ఆ మాత్రం తెలియదా మీకు. పాలసీ రీసెర్చ్ ఎల్లా చేస్తారో? కమిషన్ ఏం పనిచేసిందో, ఎలా పనిచేసిందో రిపోర్టు చూస్తే అర్థమవుతుంది. మీది ఎట్లా ఉందంటే ఆడలేక మద్దెల వోడు అన్నట్టుంది. సీఎం రేవంత్‌రెడ్డి మీ కేసీఆర్ కంటే వెయ్యి రెట్లు నయం. నెలకు ఒక రివ్యూ పెడుతున్నారు. కమిషన్ వేశారు. వీసీలను, 10,000 కొత్త టీచ ర్లను అపాయింట చేశారు. కేసీఆర్ ఒక్క గంట అయినా విద్య మీద రివ్యూ పెట్టిండా? విద్య మీద రాజకీయాలు వద్దు అండి. మీ టీం సరిగ్గా హోమ్ వర్క్ చేసినట్టు లేదు.. చూసుకోండి’ అంటూ కౌంటరిచ్చారు.

ఈ మేరకు రిపోర్టులోని పలు వివరాలను సైతం హరీశ్ రావుకు ఆయన ట్యాగ్ చేశారు. ఇదిలా ఉంటే కమిషన్ మెంబర్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు సైతం ఓ వీడియోను విడుదల చేస్తూ...హరీశ్‌రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. గత పదేళ్లలో విద్యను నాశనం చేశారని, కానీ ఈ కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తోంటే ఈ వి ధంగా కమిషన్ నివేదికపై మాట్లాడటం సరికాదన్నారు. చాలా మంది ఇందులో పనిచేశారని, అందరి అభిప్రాయాలు తీసుకునే నివేదికను రూపొందించామన్నారు.