గాదె ఇన్నయ్యకు పితృవియోగం
- నెలన్నర వ్యవధిలో తల్లిదండ్రుల మృతి
- నివాళులర్పించిన మాజీ మంత్రి హరీశ్‌రావు
మహబూబాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): సామాజికవేత్త, తెలంగాణ ఉద్యమకారుడు, మావోయి స్టు మాజీ నేత గాదె ఇన్నయ్య తండ్రి సాల్మన్‌రెడ్డి (97) అనారోగ్యంతో మృతిచెందారు. జనగామ జిల్లా జాఫర్‌గడ్ మండలం సాగరం గ్రామంలో అనారోగ్యం, వయో భారంతో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఇన్నయ్య తల్లి థెరిసమ్మ గత నెల 15న మరణిం చారు. నెలన్నర వ్యవధిలో తల్లిదండ్రులను ఇన్నయ్య కోల్పోయారు. ఉపా చట్టం కింద ఇన్నయ్య ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.
తల్లి మరణించడంతో పెరోల్‌పై వచ్చి అంత్యక్రియలకు హాజరయ్యారు. తండ్రి మరణం తో మనోవేదనకు గురైన ఇ న్నయ్యను ప్రభుత్వం చొరవచూపి విడుదల చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సాగరం గ్రామానికి చేరుకొని సాల్మన్‌రెడ్డి భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. హరీశ్‌రావు వెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయా కర్‌రావు, తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.




