6 May, 2026 | 11:38 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

హాస్టల్ భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

06-02-2025 12:06 AM

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన 

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 5 (విజయ క్రాం తి): హాస్టల్ భవనం పైనుంచి ఓ యువతి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో  చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కత్తాకు చెందిన రిసోజ బస్ (22) కొంత కాలంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సిద్ధిక్ నగర్ జోలో స్టెర్లింగ్ పోలింగ్ హాస్టల్లో ఉంటూ ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో హెచ్‌ఆర్ విభాగంలో పనిచేస్తుంది. సోమవారం ఉదయాన్నే ఇక నేను ఉండను కేవలం నా వస్తువులు మాత్రమే ఉంటాయని సోమ వారం అర్ధరాత్రి వేళ తన ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

ఆ మెసేజ్ చూసిన రిసోజా బస్ మిత్రుడు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందిం చిన తల్లిదండ్రులు రిసోజ బస్‌కు పలు మార్లు ఫోన్ చేసిన రెస్పాన్స్ రాలేదు.

కాగా తాను ఉంటున్న హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసి అడగగా, రిసోజ బస్ తాను ఉంటున్న హాస్టల్ భవనం 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.

సమా చారం అందుకున్నా మాదాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఆత్మహత్యకు అనారోగ్య కారణంగా పోలీసులు భావిస్తున్నారు.