6 May, 2026 | 8:54 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన

06-05-2026 08:14 PM

- ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ మజీద్ షోయబ్ 

సిద్దిపేట క్రైం: యువతకు సామాజిక బాధ్యత పట్ల అవగాహన, చైతన్యం తేవడమే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్(ఎంపీజే) లక్ష్యమని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ మజీద్ షోయబ్ చెప్పారు. బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎంపీజే కృషి చేస్తుందని చెప్పారు.

రోజుల తరబడి జైల్లోనే మగ్గుతున్న నిరుపేద ఖైదీలను విడిపించడానికి ఎంపీజే బాధ్యత తీసుకుందన్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సరిచూడడానికి, కొత్త ఓటర్లను చేర్చడానికి ఇంటింటికి తిరిగి నిర్వహించే కార్యక్రమం(ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్) కోసం రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్ డెస్క్ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అనంతరం సిద్దిపేట జిల్లా ఎంపీజే నూతన కమిటీని ఏర్పాటు చేశారు.