వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఓ వివాహ వేడుకలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి సోదరుడు ఘట్కేసర్ రైతు సహకార సంఘం మాజీ డైరెక్టర్ బోయపల్లి సత్తిరెడ్డి-తిరుమలత దంపతుల కుమారుడు ప్రణత్ రెడ్డి-పూజరెడ్డి వివాహం కీసర సమీపంలోని ఆరాధ్య కన్వెన్షన్ హాల్లో బుధవారం జరిగింది.
ఈవివాహ వేడుకలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లు, మాజీ కౌన్సిలర్ లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, అధికారులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వారిలో ఉన్నారు.






