26 July, 2026 | 3:15 PM

ప్రియుడి వేధింపులకు యువతి ఆత్మహత్య

31-05-2024 12:20 AM

మేడ్చల్, మే 30 : ఇద్దరూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుని ధైర్యంగా పెద్దలకు చెప్పి వివాహానికి ఒప్పించారు. మరికొద్ది నెలల్లో వివా హం చేద్దామని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. ఏమైందో ఏమో కానీ ప్రియు డు మనసు మార్చుకుని కట్నం తేవాలని, వాట్సాప్‌లో దుర్భాషలాడుతూ మానసికం గా హింసించడం ప్రారంభించాడు. దీంతో మనోవేదనకు గురైన యువతి ఇంట్లో ఎవ రు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిం ది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం న్యూఎల్బీనగర్‌కు చెందిన బాలబో యిన కుమార్ కుమార్తె అఖిల(22) ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది.

అదే కాలనీకి చెందిన ఓరుగంటి అఖిల్ సాయిగౌడ్ ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ప్రేమించకపోతే చనిపోతానని బెదిరించడంతో చివరకు అంగీకరించింది.ఇరు కుటుంబాలను ఒప్పిం చి పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే, కట్నం రాదనుకుని భావించిన అఖిల్ సాయిగౌడ్ తనకు రూ.70లక్షల కట్నం కావాలని డిమాండ్ చేశాడు. ఇలా వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా తాను పెట్టిన మెసేజ్ లు డిలీట్ చేయాలని బెదిరించాడు.

ఈ విషయం అందరికి తెలియడంతో పెళ్లి చేసు కోనని మొండికేశాడు. దీంతో అతని వేధింపులు తట్టుకోలేక మంగళవారం రాత్రి తన గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అఖిల చనిపోయిన వెంటనే అఖిల్ సాయిగౌడ్ తన తల్లిదండ్రులు, చెల్లెతో కలిసి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.