26 July, 2026 | 4:01 PM

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

31-05-2024 12:19 AM

ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ 

రాజేంద్రనగర్, మే 30 : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీకి మంచి పట్టు ఉందని, కాంగ్రెస్, బీజేపీల అబద్ధపు హామీలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి శ్రమించాలని రాజేంద్రనగర్ నియో జకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అన్నారు. గురువారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని కార్పొరేషన్ అధ్యక్షులు అంతారం నరేష్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను అబద్ధపు హామీలతో మోసం చేస్తున్నా యన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ఇచ్చిన హామీ లు నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బుర్ర మహేందర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బుర్ర రాందాస్ ముదిరాజ్, కార్పొరేటర్లు సాగర్‌గౌడ్, సురేష్‌గౌడ్ పాల్గొన్నారు.