రూ.7వేల కోట్ల బకాయిలను చెల్లించాలి
రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో 20 లక్షల మంది ఇంజినీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ విద్యార్థులకు చెల్లించాల్సిన రూ. 7వేల కోట్లను తక్షణమే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్‌లో 13 బీసీ సంఘాల సమావేశం గురువారం జరిగింది. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్, బీసీ సంఘం అధ్యక్షుడు రాజేందర్ అధ్యక్షత వహించిన ఈ సమాశానికి ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కళాశాల విద్యార్థులకు రీయంబర్స్‌మెంట్ ఫీజు లు మంజూరు చేయడం లేదన్నారు. ఫీజులు సకాలంలో విడుదల చేయకపోవడం వలన కళాశాల యజమాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్లాసుల నుంచి బయటకు పంపి అవమానపరుస్తున్నారని పేర్కొన్నారు. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామనే నిబంధన పెడుతూ విద్యార్థు లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పా రు.
ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకుంటే గత 12 సంవత్సరాలుగా కొందరు నాయకులు ప్రభుత్వ ధనాన్ని దోచుకుని వేల కోట్లు సం పాధిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల బకాయి ఫీజులను చెల్లించాలన్నారు. సమావేశంలో విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి, కార్యదర్శి మూసిపట్ల లక్ష్మీనారాయణ, గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి సంఘం నాయకులు నిఖిల్, బీసీ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోలా శివకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెం ట్ సాయిలు యాదవ్ పాల్గొన్నారు.






