యువత సమాజ మార్పులో కీలక పాత్ర పోషించాలి
జాతీయ బిసి సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్
సత్తుపల్లి,(విజయక్రాంతి): యువత సమాజంలో మార్పులు తీసుకురావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేంసూర్ రోడ్ లో గల జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కార్యాలయంలో యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు కోమటి తిరుమలరావు అధ్యక్షతన 5 మండలాల యువతతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని యువతని ఉద్దేశించి మాట్లాడారు యువత తలుచుకుంటే ఈ సమాజంలో దేన్నైనా సాధించే శక్తి ఉందని, అటువంటి యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా విద్య, ఉద్యోగ ,రాజకీయ, వ్యాపార రంగాల్లో తనదైన పాత్ర పోషించాలన్నారు. ముఖ్యంగా బీసీ యువత బీసీల అణిచివేతను వ్యతిరేకిస్తూ న్యాయబద్ధమైన బీసీ హక్కులకై పోరాటాలు జరపాలని పిలుపు నిచ్చారు.
బీసీల రాజ్యాధికార ఉద్యమంలో యువత పాత్ర కీలకం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయా మండలాల నూతన అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం సత్తుపల్లి నియోజకవర్గం అధ్యక్షులు దుస్సా వెంకటేశ్వర్లు, బీసీ సంఘం సీనియర్ నాయకులు డాక్టర్ పెద్దిరాజు, యువజన విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకురి మరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.




